Police notification will be release soon

Police notification will be release soon

Police, Notification, Jobs, AP Govt Jobs, Telangana Police Jobs, Govt Jobs, Chandrababu, KCR, Jobs Notification

AP, Telangana govt getting ready to release notifications to fill vaccencies in the police department. Chandrababu Naidu told about the police notication.

త్వరలో పోలీస్ శాఖలోని ఉద్యోగాల భర్తీ

Posted: 10/21/2015 09:42 AM IST
Police notification will be release soon

శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ శాఖలో చాలా వరకు ఖాళీలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దాంతో క్రైం రేట్ అంతకంతకు పెరుగుతోంది. కాగా నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వరలో అమరవీరుల స్థూపం నిర్మిస్తామని, పోలీసుల సంక్షే మానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రజల సంక్షేమం పోలీసుల బాధ్యత అయితే, పోలీసుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు చెప్పారు. పోలీసు సంక్షేమనిధికి రూ.10 కోట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.

కాగా మూడు రోజుల క్రితం తెలంగాణలోని పది వేల పోలీస్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలకు సర్కార్ చేపడుతోంది. కాగా ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని.. అందుకు ఆర్థికశాఖ కూడా సిద్దంగా ఉందని తెలిపారు. 9200 కానిస్టేబుల్, 800 ఎస్సై పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు సమాచారం.

*అభినవచారి*

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Notification  Jobs  AP Govt Jobs  Telangana Police Jobs  Govt Jobs  Chandrababu  KCR  Jobs Notification  

Other Articles