Telangana cm KCR is useless

Telangana cm kcr is useless

Telangana, TTDP, farmers, Suicide, KCR, Ramana, L.Ramana, kavitha, Telangana Govt

Telangana TeluguDesam party president L.Ramana slams Telangana Cm and his govt. He said that KCR is useless. He demand to allot funds for farmers crop loans.

చేతగాని కేసీఆర్.. చేతగాని సర్కార్

Posted: 10/16/2015 04:41 PM IST
Telangana cm kcr is useless

సిఎం కేసీఆర్, తెలంగాణ సర్కార్ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. కేసీఆర్ కు చేతగాదని.. చేతగాని సర్కార్ తెలంగాణలో ఉందని అన్నారు. కేంద్రం దగ్గరి నుండి నిధులను రాబట్టుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద కేసీఆర్ కు చీమ కొట్టనట్లైనా లేదని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ వైఖరిని ఖండిస్తూ.. ఈ నెల 19న హైదరాబాద్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే 1600 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు.తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులను కోరామని తెలిపారు రైతులకు రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈనెల 19న ఎస్‌బీహెచ్‌ ప్రధాన బ్రాంచ్‌ ఎదుట ధర్నా చేపడుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. మంత్రులు హరీష్‌, కేటీఆర్‌ శాఖలకు వేలాది కోట్లు కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీ కవిత బతుకమ్మకు కోట్లాది రూపాయలు కేటాయించిన ప్రభుత్వం, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని రమణ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TTDP  farmers  Suicide  KCR  Ramana  L.Ramana  kavitha  Telangana Govt  

Other Articles