Modi known for Godhra, unfortunate he condemned Dadri lynching: Shiv Sena

Modi is known to world with godhra ahmedabad shiv sena

shiv sena, narendra modi, godhra riots, sanjay raut, gujarat riots, sena bjp, kasuri book launch, bjp news, dadri lynching, narendra modi

Things have not been smooth between the BJP and the Shiv Sena in Maharashtra

గోద్రా ఘటనతోనే మోడీ ప్రపంచానికి తెలుసు.. కానీ..!

Posted: 10/14/2015 08:20 PM IST
Modi is known to world with godhra ahmedabad shiv sena

మహారాష్ట్ర బిజెపితో పాటు శివసేన పార్టీ కేంద్రానికి కూడా పంటికింద రాయిలా మారింది. దాద్రీ ఘటనను ఖండించడంతో పాటు ముంబైలో గులాం అలీ కచేరీని రద్దు చేయడాన్ని దురదృష్టకరమైందన్న ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన విరుచుకుపడుతోంది. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని మాట్లాడుతూ ఈ రెండు అంశాలు రాష్ట్రప్రభుత్వాల పరిధిలోనివని, కేంద్రానికి వీటితో సంబంధమేంటని ప్రధాని ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలపై చిర్రుబుర్రులాడిన శివసేన ఆయన్ను, బిజెపిని ఇరుకున పెట్టేందుకు యత్నించింది.

అహ్మదాబాద్ లో జరిగిన గోధ్రా అల్లర్లతోటే మోదీ పాపులర్ అయ్యారని, గోధ్రా కారణంగా ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తిగా మారారన్నారు. ఆ ఘటనలతోనే తమకు మోడీ అంటే గౌరవభావమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ముంబైలో సుధీంద్ర కులకర్ణికి నల్లరంగు పూయడంపై మహారాష్ట్ర సిఎం బహిరంగంగానే శివసేనను విమర్శించారు. దీనిపై కూడా శివసేన అగ్గిమీదగుగ్గిలం అవుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే త్వరలోనే కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా శివసేన వైదొలగవచ్చని భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay raut  shiv sena  narendra modi  godhra riots  

Other Articles