twitter attacks aap for 400 percent pay hike recommendation for mlas

400 pay hike for mlas is essential

delhi mlas salary, delhi mla salary hike, aap mlas salary, aap mlas, aap news, delhi news, AAP MLA's salaries, Twitter attacks, recommendation for MLAs

In July, a group of AAP legislatiors had demanded a significant hike in salary, arguing their earnings were not enough to run their family and offices.

వారి జీతబెత్యాలపై నెట్ జనుల విసుర్లు.. అయినా తప్పని సరి అంటూ సమర్థింపు

Posted: 10/08/2015 03:51 PM IST
400 pay hike for mlas is essential

భారత దేశం ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టి రమారమి ఏడాదిన్నర కాలం కావస్తున్న.. ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన మంచి రోజులు మాత్రం దేశ ప్రజలకు ఇంకా రాలేదు కానీ ఆ తరువాత ఢిల్లీలో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వానికి, శాసనసభ్యలకు మాత్రం మంచి రోజులు వచ్చేశాయి. అదెలా అంటారా..? సామాన్యుల పార్టీగా సామాన్యుడి బలంతో వచ్చిన అప్ పార్టీ సామాన్యుడి అందనంత దూరం అవుతుంది. ఇది నిజమండి.. ఇలా అంటూ నెట్ జనులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అదేంటి.. అందనంత దూరం ఎందుకవుతున్నారనేగా మీ సందేహం.

ఆప్ ఎమ్మెల్యేలలో చాలా మాటుకు సర్వసాధారణమైన మధ్యతరగతి నుంచి వచ్చిన వారే. అయితే వారికి ప్రస్తుతమున్న వేతనాలు 88 వేల రూపాయలను (కరువు, ఇతర భత్యాలను కలుపుకొని) 2.10లక్షల రూపాయలకు పెంచాలంటూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్య్ర పానెల్ సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. దీంతో జీతాలు పెరిగిన వారు తమకెలా దెగ్గరవుతారని, నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా 400 శాతం పెంపును సిఫార్సు చేయడం ఏమిటని ట్విట్టర్ యూజర్లు ‘ట్వీట్లు తొక్కారు’.

మంచి రోజులు ఆప్ ఎమ్మెల్యేలకే ఉన్నాయి... ఆమ్ ఆద్మీ కాస్త ఖాస్ ఆద్మీగా మారిపోయింది....ఆమ్ ఆద్మీ బికమ్ ఏ అంబానీ ఆద్మీ! ఫుల్ యాష్ కర్‌లో భాయ్! ఫిర్ కబీ ఎమ్మెల్యే బనే కా మౌకా మిలే న మిలే.....మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలూ ఎలాగు లేవు. ఈ ఐదేళ్లలో ఎంత దోచుకుంటే అంత దోచుకోండి ఖజానాను....ఢిల్లీ ఎమ్మెల్యేలకు నాలుగు రెట్లు జీతం పెరుగుతోంది. ఢిల్లీలో నాలుగు రెట్లు డెంగ్యూ మృతులూ పెరిగారు...సిగరెట్లు, విదేశీ మద్యం విపరీతంగా పెరిగింది, ఎమ్మెల్యే జీతాలు పెరిగాయి....400 శాతం జీతం పెంపు, ఇది ఆమ్ ఆద్మీ జీతమా?...ఆమ్ ఆద్మీ పార్టీ పేరును వీవీఐపీగా మార్చుకోండి’ ఇలా నెట్ జనులు విమర్శల వర్షం కురిపించారు.

‘వంద శాతమో, రెండు వందల శాతమో పెంచుకొని, మిగతా సొమ్మును త్యాగం చేశామని చెప్పండంటూ నెట్ జనుల నుంచి సూచనలు కూడా వచ్చాయి.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు జీతభత్యాలతోపాటు, బెదిరింపులతో దండుకునే సొమ్ము, కమీషనల్ల ద్వారా వచ్చే సొమ్ము అదనం కాగా, ఆమ్ ఆద్మీకి కేవలం జీతభత్యాలే వస్తాయి’ అంటూ కొన్ని సానుకూల స్పందనలు కూడా వచ్చాయి. అందరిలా కాకుండా జీతాలపై ఆధారపడి.. పార్టీని, నియోజకవర్గాన్ని పర్యవేక్షించాల్సిన అప్ నేతలు ఈ జీతం సమంజసమేనని కొందరు ట్విట్ చేశారు. కాగా రాజకీయాలలో అవినీతికి అస్కారం లేకుండా నీతిబద్దంగా జీతాలను పెంచుకోవడం కూడా తప్పేనా అంటూ సమర్థించే ట్విట్లు కూడా వున్నాయి.

కాగా, ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన జీతబెత్యాలను పెంచాల్సిందిగా నిర్ణయానికి వచ్చినట్లు ఆప్ ప్రభుత్వం తెలిపింది. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్య్ర కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే వేతన సిఫార్సులను పెంచాలని సూచించిందని ఆప్ వర్గాలు తెలిపాయి. కమిటీ సూచనలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పాయి. ఢిల్లీ అసెంబ్లీలో రమారమి 67 మంది శాసనసభ్యులు తమ ఆద్మీ పార్టీకి చెందిన వారే వుండటంతో అప్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP MLA's salaries  Twitter attacks  recommendation for MLAs  

Other Articles