Marshals push mlas from the assembly

Marshals on mlas

Jammu Kashmir, Kashmir, Assembly, National Conference, Marshals

Chaos prevailed in the Jammu and Kashmir Assembly today as banner-waving legislators of opposition National Conference and Congress stormed the well over beef ban and other issues. As soon as the house assembled, National Conference (NC) and Congress members started their protest, displaying banners in the well of the House against alleged "politics over flood relief" and tax on Vaishno devi pilgrims.

ఎమ్మెల్యేలను ఎత్తి బయటకు వేశారు

Posted: 10/05/2015 01:35 PM IST
Marshals on mlas

అసెంబ్లీ సమావేశాలు అంటేనే నానా రాద్దాంతం. అధికార పక్షానికి చెందిన వాళ్లు ఏదో ఒకటి మాట్లాడటం.. కాదు కూడదు అంటూ ప్రతిపక్షాలకు చెందిన నాయకులు దానికి అడ్డుతగలడం శరామామూలే. అయితే ప్రతిపక్షమో లేదంటే పాలకపక్షమో హద్దు దాటితే మాత్రం పరిస్థితి దారుణంగా మారుతుంది. అప్పుడు అంగ బలం చూపించాల్సి వస్తుంది. తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కూడా అదే చోటుచేసుకుంది. ఏకంగా ఎమ్మెల్యేలనే మార్షల్స్  చేత సభ బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కాదు లెండి.. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో చోటుచేసుకున్న వ్యవహారం. జమ్ము కాశ్మీర్ లో ఎమ్మెల్యేలను గెంటివెయ్యాల్పిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? అయితే చదవండి.

జమ్ము కాశ్మీర్ లో బిజెపి అధికారంలో ప్రభుత్వం నడుస్తోంది. అయితే గత కొన్ని రోజుల క్రితం అక్కడ బీఫ్ ను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. దాని మీద సుప్రీంకోర్ట్ లో కూడా తీర్పు వెలువడింది. బీఫ్ బ్యాన్ మీద ప్రభుత్వం ఎందుకు ఉత్సుకత ప్రదర్శించిదని ప్రతిపక్షాల నాయకులు అసెంబ్లీలో మండిపడ్డారు. తీర్థయాత్రల మీద యాత్రికులకు కల్పిస్తున్న రాయితీల, వరదల సహాయం మీద ఇలా మొత్తంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ముప్పుతిప్పలు పెట్టాయి. సభ నడవకుండా అన్ని పార్టీల నాయకులు స్పీకర్ పొడియం ముందు బైఠాయించారు. అయితే తీవ్ర అసహనానికి గురైన స్పీకర్ ప్రతిపక్ష నాయకులను సభ నుండి గెంటివెయ్యాల్సిందిగా మార్షల్స్ కు ఆదేశించారు. దాంతో ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu Kashmir  Kashmir  Assembly  National Conference  Marshals  

Other Articles