Her 30 year old flower vase turned out to be unexploded WWI bomb

Flower vase turned to bomb

WWI bomb, flower vase, Kathryn Rawlins, UK

Kathryn Rawlins had no idea how fatal her favourite 30-year-old flower vase was until she saw a war documentary on TV. The heavy metal shell turned out to be an unexploded bomb from World War I. The 45-year-old mother-of-two and a school careers advisor in UK, had found the shell when she was 15 in the playing fields of her school and had been using it as an antique in her house.

ఫిరంగి గుండులొ పూలు పెడితే

Posted: 10/05/2015 12:03 PM IST
Flower vase turned to bomb

యుద్దాలు ఎందుకు మనిషిని మనిషి చంపడానికి తప్ప. ఆయుధాలు వదలండి అంటూ రోబో సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంది. అయితే లేబల్ తీసిన బాంబ్ మీద రోబో రజనీ గులాబీ పువ్వు పెడతాడు అలా బాంబ్ మీద పువ్వు పెట్టడం సినిమాలో జరిగింది. కానీ లైవ్ లో ఎవరైనా అలా చేస్తారా..? అంటే చేసే వాళ్లుంటారు. తెలిసో తెలియకో అలా చేసి తీరా తాము చేసిన తప్పేంటో తెలుసుకున్న వాళ్లున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. లండన్ కు చెందిన ఒకావిడ ఫ్లవర్ వాజ్ అనుకొని ఓ ఫిరంగి గుండు మీద రోజు పువ్వులు మార్చి తర్వాత అది ఫ్లవర్ వాజ్ కాదు ఫిరంగి అని తెలుసుకొని కళ్లెళ్లబెట్టింది. పాపం అమ్మడు ఒకవేళ ఫిరంగి అని ముందే తెలిసి ఉంటే ఆమడదూరంలో ఉండేదేమో. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

బ్రిటన్లోని కావెంట్రీ అనే ప్రాంతలో కేథరిన్ రాలిన్ అనే మహిళ ఉంటోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్న సమయంలో ఓ పాఠశాలకు సమీపంలో ఆడుకుంటుండగా ఓ ఫిరంగి గుండు దొరికింది. అయితే, దానిని ఇంటికి తీసుకెళ్లిన కేథరిన్ దానిని ఒక ఫ్లవర్ వాజ్గా భావించి అందులో తనకు ఇష్టమైన ప్లాస్టిక్ పూలను పెట్టి అలంకరించుకుంటోంది. అది లైవ్ బాంబ్ అని ఆమెకు తెలియదు కూడా.     ఈ ఫిరంగి గుండుని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సేనలు జారవిడిచాయి. కానీ అప్పట్లో అది పేలలేదు. ఇయితే ఇటీవల ఆమె ఓ డాక్యుమెంటరీని వీక్షించింది. అందులో నాడు జర్మనీ సేనలు కావెంట్రీ ప్రాంతంలో ఓ బాంబును జారవిడిచాయని, కానీ అది పేలలేదని దాని ఛాయా చిత్రాలు కూడా చూపించింది. దీంతో తొలుత అదిరిపడింది. అది పేలితే ఓ ఇళ్లును నేలమట్టం చేయడంతోపాటు 20 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందని కూడా పోలీసులు ఆ డాక్యుమెంటరీలో చెప్పారు. దీంతో ఆమెకు గుండెలు జారినంతపనైంది. దీంతో పోలీసులు వచ్చి దానిని తీసుకెళ్లి చివరకు అందులోని పేలుడు పదార్థాన్ని తొలగించి తిరిగి ఆమెకే ఆ వస్తువును అప్పగించడంతో మళ్లీ ఫ్లవర్ వాజ్గా వాడుకుంటోంది. మొత్తానికి నిన్నటి దాకా వాడిన ఫ్లవర్ వాజ్ సడన్ గా ఫిరంగి అంటే ఎవరికైనా వెన్నులో వణుకుపుడుతంది మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WWI bomb  flower vase  Kathryn Rawlins  UK  

Other Articles