KCR and Harish Rao playing games

Kcr and harish rao games

Telangana, Assembly, KCR, Harish Rao, Revanth Reddy, T Assembly

Telangan TDP party leader Revanth Reddy slam KCR and Harish Rao. He said that KCR and Harish Playing games at telangana assembly.

ఆటాడుతున్న కేసీఆర్, హరీష్ రావు

Posted: 10/05/2015 11:28 AM IST
Kcr and harish rao games

అవును. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరూ కలిసి ఆటాడుతున్నారట. అది కూడా ఎక్కడో ఎవరికీ తెలియకుండా కాదు.. తెలంగాణ అసెంబ్లీలో. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన పంథాలో తాను అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల మీద ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని.. సభను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. అయితే కేసీఆర్ మాట్లాడిన తర్వాత సభలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో హరీష్ రావు ప్రతిపక్ష పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తూ తీర్మానం తీసుకువచ్చారు. అయితే దీని మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు.

ముందు కేసీఆర్ మాట్లాడతారు.. ఆ వెంటనే మిమ్మల్ని అంతా ఎత్తేస్తున్నాం. సభ నుండి సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానాన్ని తీసుకువస్తారు. ఇలా మామా అల్లుళ్లు కలిసి ఆటలాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభలో ఉన్న వారిని మాట్లాడకుండా చేసి ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వన్ టైం సెటిల్ మెంట్ చెయ్యాలని అలాగే రైతులకు కొత్తగా రుణాలు మంజూరయ్యేట్లు బ్యాంకులకు ఆదేశాలు జారీ చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఆట అది.. కేసీఆర్ ఆడినా. హరీష్ రావు ఆడినా మాకేంటి అనేది చాలా మంది సామాన్యుల ప్రశ్న.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Assembly  KCR  Harish Rao  Revanth Reddy  T Assembly  

Other Articles