chain snatchers attack women at various places in hyderabad on third day

Straight third day chain snatchers create panic in hyderabad

Chain snatchers, hulchul, hyderabad city, chain snacthes create panic in hyderabad, chain snatchers attacks on lone woman, woman gold ornaments, old criminals, easy money, cyberabad, Chain snatchers hulchul in malkajgiri, Chain snatchers hulchul in vanasthalipuram

women scared to come out on roads in hyderabad due to chain snacthing incidents that are rocking in hyderabad, On saturday chain snatchers attacked on women at 5 different places in hyderabad

మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఇవాళ ఐదు చోట్ల అభరణాలు తెంచుకెళ్లారు

Posted: 10/03/2015 06:40 PM IST
Straight third day chain snatchers create panic in hyderabad

రాజధానిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. శనివారం ఒక్కరోజే ఐదుచోట్ల మహిళల మెడల్లోని గొలుసులు లాక్కెళ్లారు. మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లో ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఓ మహిళ తన ఇంటి ముందు పూలు తెంపుతుండగా ఆమె మెడలో నుంచి రెండు తులాల బంగారు ఆభరణాన్ని అపహరించారు. అదే మల్కాజ్‌గిరి ప్రాంతంలోని భ్రమరాంబిక నగర్‌లో మరో మహిళ మెడలోని 3 తులాల బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. మరోవైపు వనస్థలిపురంలోని హైకోర్టు కాలనీలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు జయమ్మ అనే మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. కుషాయిగూడలోని ఇందిరానగర్‌లో 4 తులాల గొలుసును అపహరించారు.
 
నాగోల్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దుండగులు పక్కా సమాచారంతో నాగోల్‌లోని ఓ ఇంట్లో సుశీల అనే వివాహిత ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డారు. సుశీల మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ సమయంలో సుశీల దోపిడి దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారు ఆమెపై దాడి చేశారు. ఈ దాడిలో సుశీల తీవ్రంగా గాయపడింది. ఇది గనమించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. దోపిడీకి గురైన బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
 
అయితే తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో ఐదు ప్రాంతాల్లో దొంగతనాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఈ దోపిడీలకు పాల్పడిన వారిని గుర్తించలేకపోయారు. అంతర్‌రాష్ట్ర దోపిడి దొంగల ముఠా పనా? లేదా స్థానిక చైన్ స్నాచర్ల పనా అనేది పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. పోలీసులకు అధునాతనమైన ఆయుధాలు సమకూర్చినప్పటికీ, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తూ అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ చైన్ స్నాచర్లను పట్టుకోలేకపోతున్నారు. మరోవైపు బస్తీల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ చైన్ స్నాచర్లు తమ అరాచకాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా చైన్ స్నాచర్లను అడ్డుకోలేకపోవడంతో మహిళలంతా ఒంటిరిగా రోడ్డుపైకి రావడానికి భయంతో వణికిపోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chain snatchers  hulchul  cyberabad  malkajgiri  vanasthalipuram  

Other Articles