Director Puri Jagannadh Has Posted Sensational Comments On Chiranjeevi 150 Film | Chiru 150 Movie Updates | Ram Charan News

Puri jagannadh sensational comments on chiranjeevi 150 film

puri jagannadh news, director puri jagannadh facebook, director puri jagannadh latest updates, director puri jagannadh twitter, chiranjeevi news, chiranjeevi 150 film, chiru 150 film updates

Puri Jagannadh Sensational Comments On Chiranjeevi 150 Film : Director Puri Jagannadh Has Posted Sensational Comments On Chiranjeevi 150 Film.

‘చిరంజీవి 150వ చిత్రం తీసే హక్కు నాకే వుంది’

Posted: 09/30/2015 06:30 PM IST
Puri jagannadh sensational comments on chiranjeevi 150 film

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించనున్నట్లు స్వయంగా చిరుతోపాటు రామ్ చరణ్ వెల్లడించిన విషయం తెలిసిందే! అందుకు సంబంధించిన కార్యక్రమాలు ఆ మధ్య చకాచకా జరిగిపోయాయి కూడా. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ.. పూరీని ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారంటూ ప్రచారాలు జోరుగా సాగాయి. అలాంటిదేమీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెర్రీ స్పష్టం చేశాడు. పూరీ స్టోరీని డెవలప్ చేస్తున్నాడని, త్వరలోనే సినిమాకి సంబంధించి వివరాలు తెలియజేస్తామని చెర్రీ ఆ సందర్భంలోనే చెప్పాడు. కానీ.. చిరు తన బర్త్ డే సందర్భంగా తన 150వ చిత్రంపై బాంబ్ పేల్చేశారు. పూరీ చెప్పిన కథ నచ్చిందని పేర్కొన్న ఆయన.. ఇప్పుడే 150వ చిత్రంపై క్లారిటీ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారు. దాంతో.. ఆ ప్రాజెక్టు నుంచి పూరీ దాదాపు ఔట్ అయినట్లేనంటూ మళ్లీ పుకార్లు మొదలయ్యాయి.

ఇక తన బర్త్ డే సందర్భంగా పూరీ కొన్ని సంచలన కామెంట్లు చేశాడు. తాను చెప్పిన స్టోరీలోని ఫస్ట్ పార్ట్ కు చిరు ఓకె చెప్పారని, కానీ రెండో భాగంపై అసంతృప్తి ప్రకటించారని పూరీ ఓ ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించాడు. ఈ రెండో పార్ట్ లో ఆయనకు నచ్చని అంశాలేవైనా ఉంటే తనకు తగిన సూచనలు చేసి ఉండాల్సిందన్నాడు. ఆయన సూచనల మేరకు స్టోరీని మార్చి ఉండేవాడినని కూడా పేర్కొన్నాడు. మొత్తంగా చెప్పాలంటే.. చిరు వైఖరి కారణంగా తాను మనస్తాపం చెందిన ధోరణిలో పూరి మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి. చిరు 150వ చిత్రాన్ని పూరీ డైరెక్ట్ చేయకపోవచ్చుననే అనుమానాలు మరింత బలమయ్యాయి. కానీ.. ఈ ప్రచారాలకు బ్రేక్ వేస్తూ తాజాగా పూరీ తన ఫేస్ బుక్ లో చిరు 150వ చిత్రంపై ఓ పోస్ట్ చేశాడు. మోగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అందరికంటే ఎక్కువ హక్కు తనకే వుందని ట్విట్ చేశాడు.

'చిరంజీవి 150వ సినిమా చేయడానికి అందరికంటే నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం.. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద ఫ్యాన్ని. తెర మీద చిరంజీవి ఎలా ఉండాలో ఆయన కన్నా....ఫ్యాన్స్కే తెలుసు. ఈ కథ కుదరకపోతే మరో కథ చేస్తాను. అదీ కుదరక పోతే ఆయనకి నచ్చేంతవరకు చేస్తా. 150వ సినిమా నేనే చేస్తా.. లేదంటే 151వ సినిమా చేస్తా. ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలన్నదే నాకోరిక' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి.. పూరి చేసిన ఈ తాజా ట్విట్పై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jagannadh  chiranjeevi 150 film  

Other Articles