Zuckerberg makes mistake to come between PM Modi and TV camera

Pm modi pushes mark zuckerberg aside for coming in between camera angle

modi pulls Zuckerberg aside, modi media craze, modi publicity craze, congress attacks modi, narendra modi, mark zuckerberg, facebbok, america, camera, media, American media, PM Modi Pushes Mark Zuckerberg Aside, modi push mark zuckerberg, modi in united state, modi in silicon valley, modi at facebook

Video in which PM Modi Pushes Mark Zuckerberg aside For Coming In-between Camera Angle was first seen on Facebook and went viral.

ITEMVIDEOS: వేనోళ్ల పొగిడిన అమెరికా మీడియా.. మోడీని ఎందుకు విమర్శిస్తుంది..?

Posted: 09/30/2015 03:10 PM IST
Pm modi pushes mark zuckerberg aside for coming in between camera angle

అమెరికా పర్యటనలో వున్న మన దేశ ప్రధాని నరేంద్రమోడీని రాక్ స్టార్ లా ఆకాశానికెత్తేసిన అగ్రరాజ్య మీడియానే.. ఆయనపై విమర్శలు గుప్పిస్తుంది. 24 గంటల వ్యవధిలోనే ఈ మార్పు ఎందుకు వచ్చింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఫాలో అయ్యే నెట్ జనులు కూడా ఆయనపై విమర్శలు, సెటైర్లు విసురుతున్నారు..? ఎందుకని..? అంటే నరేంద్రమోడీకి మీడియా అంటే వున్న అసక్తే ఇందుకు కారణమా..? మోడీకి కెమెరాలకు మధ్య వున్న అవినాభావ సంబంధం.. ప్రచార క్రేజు.. పబ్లిసిటీ పిచ్చి ఇలా ఏదైనా కారణంగా చెప్పుకోవచ్చా అంటే అవుననే అంటున్నాయి అమెరికా మీడియా.

నరేంద్రమోడీ కెమెరా మోజుపై అగ్రరాజ్య మీడియా విమర్శలూ ఎక్కుపెడుతోంది. మోడీ అమెరికాలోని సిలికాన్ వాలీలో ఫేస్‌బుక్ ఆఫీస్‌ను సందర్శించిన సమయంలో మోడీ వ్యవహరించిన తీరు.. మరీ ముఖ్యంగా ఫేస్ బుక్ సీఈఓ జూకర్ బర్గ్ తో ఆయన ప్రవర్తిన విధానం విమర్శలకు తావిస్తోంది. ఓ కెమెరామెన్‌ ఫోటో తీస్తుంటే.. అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్‌ను పక్కకు లాగేశారు మన ప్రధాని. మోడీ కెమెరాకు మోడీకి మధ్య తాను అడ్డుగ్గా వున్నానని తనను చేయి పట్టుకుని పక్కకు లాగిన విషయాన్ని గ్రహించిన జూకర్ బర్డ్ కొంత ఇబ్బందిపడ్డాడు. ఆయన అసహనం తన ముఖంలో స్పష్టంగా ప్రస్పుటించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

భారత దేశ ప్రధాని హోదాలో విదేశాలకు వెళ్లడం పక్కనబెడితే.. అక్కడ ఆ హుందాకు తగ్గట్టుగా నడుచుకోవాలని కాంగ్రెస్ చురలంటించింది. తన ఫోటోల పిచ్చిని తగ్గించుకోవాలని కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. విదేశీ గడ్డపై మోడీ కెమెరా అటెన్షన్...ఇప్పుడు దుమారం రేపుతోంది. అమెరికా పర్యటనను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ప్రధానికి ఇదో దిష్టిచుక్కగా మారింది. మోడీ తీరు స్కూల్ పిల్లాడిలా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ప్రధాని అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అన్నారు. మీడియా తనను ఫోకస్‌ చేయాలన్న తాపత్రయంతో ఫేస్‌బుక్ సీఈఓను చేయి పట్టుకుని లాగిమరీ ...ఫోటోలకు ఫోజులివ్వడం సిగ్గుచేటని విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  mark zuckerberg  facebbok  america  camera  media  

Other Articles