Finally Janagama Court Granted Bail To Errabelli Dayakar Rao | TRS TDP Fight | Telangana issues

Janagama court grant bail to errabelli dayakar rao

errabelli dayakar rao, errabelli news, janagama court, janagama court incident, errabelli dayakar incident, errabelli dayakar latest updates

Janagama Court Grant Bail To Errabelli Dayakar Rao : Finally Janagama Court Granted Bail To Errabelli Dayakar Rao.

ఆ కేసులో ఎర్రబెల్లికి బెయిల్ మంజూరు

Posted: 09/28/2015 07:07 PM IST
Janagama court grant bail to errabelli dayakar rao

వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డులో జరిగిన ఘర్షణ కేసులో టీ.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! ఆ వివాదంలో ఆయనతోపాటు మరో 27 మందిపై పలు సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సోమవారం ఉదయం జనగామ కోర్టులో ఎర్రబెల్లి సహా 27 మందిని హజరుపరచగా.. వాదనలు విన్న అనంతరం కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ దెబ్బతో ఖంగుతిన్న టీడీపీ పార్టీ.. వెంటనే ఆయన బెయిల్ విషయమై పరుగులు తీసింది. అప్పటికప్పుడు ఎర్రబెల్లి తరఫున ఆయన న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

బాధ్యతగల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిన వున్నందున.. బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు బెయిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టులో చాలాసేపు వాదనలు జరిగిన అనంతరం.. చివరగా విచారించిన మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా.. పాలకుర్తిలో ఆదివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమం రసాభాసగా మారింది. ఎర్రబెల్లిపై పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించగా, టీడీపీ కార్యకర్తలు వాళ్లని అడ్డుకోవడంతో ఘర్షణలు తలెత్తాయి. ఎస్‌ఐ సహా ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు, 10మందికి పైగా టీడీపీ వర్గీయులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao news  trs tdp fight  

Other Articles