balapur laddu auctioned at a price of Rs. 10.32 lakh

Balapur laddu auctioned at record price

balapur laddu auctioned at record price, balapur laddu auctioned at a price of Rs. 10.32 lakh, balapur Ganesh, balapur laddu, hyderabad, auction, Rs 10.32 lakh, kallam madan mohan reddy

world famous balapur ganesh laddu auctioned at record price, kallam madan mohan reddy owned it at a price of rs 10.32 lakh

రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ..

Posted: 09/27/2015 11:35 AM IST
Balapur laddu auctioned at record price

11 రోజుల నిత్య పూజల తరువాత నిమజ్జనానికి కదిలే బొజ్జ గణపయ్య. లడ్డూ వేలానికి తెలుగురాష్ట్రాలలో ప్రాచుర్యాని తీసుకువచ్చింది మాత్రం బాలాపూర్ లడ్డూ అనడంలో సందేహం లేదు. ఇలాంటి ఈ లడ్డూను ప్రతీ యేటా వేలంలోొ సొంత చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారన్నడంలో సందేహమే లేదు. దీంతో ఈ ఏడాది ఈ లడ్డూను ఎవరు సొంతం చేసుకుంటారా..? అన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఏడాది పది లక్షల 32 వేల రూపాయల ధర పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ గణేశుడి లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి అత్యధికంగా వేలం పాట పాడి సొంతం చేసుకున్నారు.

ప్రతీ ఏడాది మాదిరిగానే.. రూ116 నుంచి ప్రారంభమైన వేలం పాట.. చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24 మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేశ్ లడ్డూ కల్లెం మదన్ మోహన్ రెడ్డి ని వరించింది. గత ఏడాది రూ 9.50 లక్షలు పలికిన ఈ లడ్డూ ఈ సారి మరో 82 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. ఈ లడ్డూను సొంతం చేసుకున్న సామాన్య రైతు తన పోలంలో లడ్డూను చల్లిన తరువాత.. ఆ ఏడాది తనకు మునుపెన్నడూ లేని దిగుబడి వచ్చింది. దీంతో పాటు తన కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో వృద్ది చెందింది. దీంతో ఈ లడ్డూ క్రేజ్ నానాటికీ పెరుగుతూ వచ్చింది

కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల పాటు సాగుతున్న ఈ వేలంలో ఏటేటా.. రికార్డు ధర పలుకుతోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో ఉండే ఈ లడ్డూ .. క్రమక్రమంగా  లక్షల రూపాయల స్థాయికి చేరింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balapur Ganesh  balapur laddu  hyderabad  auction  Rs 10.32 lakh  kallam madan mohan reddy  

Other Articles