bride praised after trying to save man while wearing wedding dress!

This bride is most beautiful and not because of how she looks

Bride, Wedding Dress, Wedding, most beautiful bride, Drowning man resuscitation, resuscitation, save drown, Guo Yuanyuan, beautiful dress, China, dalian city, Rescue, crt theraphy, China, China wedding, chinese bride

A nurse in wedding gown giving a drowning man resuscitation has been widely hailed on China's social media. Guo Yuanyuan was doing a photo shoot in her wedding dress on a beach in north China's Dalian City

ITEMVIDEOS: నెట్ లో పెళ్లికూతరు సంచలనం.. కళ్యాణం కన్నా కర్తవ్యానికే ప్రాధాన్యం

Posted: 09/25/2015 09:44 PM IST
This bride is most beautiful and not because of how she looks

ఎవరైనా కష్టంలో ఉంటే అయ్యోపాపం అనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ వారి కష్టం తీర్చడానికి ముందడుగు వేసేవారు చాలా తక్కువ. చైనాలో ఓ యువతి తాను పెళ్లికూతురు అన్న సంగతి మరిచిపోయి మానవత్వం ప్రదర్శించింది. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడ్డానికి ఎంతగానో తాపత్రయం పడుతున్న ఆ యువతి వృత్తిరీత్యా నర్సు. మరికాసేపట్లో వివాహం అనగా అనూహ్య సంఘటన ఎదురైంది. అప్పటి వరకు సముద్రతీరంలో ఫోటోలు దిగుతూ.. ఎంజాయ్ చేసిన పెళ్లికూతరుకు అనుకోకుండా ఓ దృశ్యం కంటపడింది. సముద్రంలో మునిగిపోతూ ఓ వ్యక్తి కనిపించాడు. స్విమ్మింగ్‌ చేస్తూ ఉండగా గుండెపోటు రావడంతో అతను ఆచేతనంగా మారిపోవడాన్ని ఆమె గమనించింది. వెంటనే స్పందించింది. అతన్ని ఒడ్డుకు తీసుకువచ్చింది. అప్పటికే ఆ వ్యక్తి గుండె స్పందన ఆగిపోయింది.

వెంటనే గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియ ప్రారంభించింది. నోటిలో నోరు పెట్టి గాలి ఊదింది. పెళ్లికూతురు అన్న సంగతి కూడా మరిచిపోయి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడ్డానికి ప్రయత్నించింది. ఇంత చేసినా ఆ వ్యక్తి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది. అయినా చైనా మీడియా మాత్రం యాన్‌ చర్యలపై ప్రసంశలు కురిపించింది. అత్యంత అందమైన పెళ్లి కూతురిగా అటు సోషల్‌ మీడియాలోనూ ఆమె ప్రసంశలు అందుకుంటోంది. యాన్‌ సాహసానికి వరుడు లీ చాంగ్‌ కూడా తెగ మురిసిపోయాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guo Yuanyuan  beautiful dress  China  dalian city  Rescue  

Other Articles