TDP party targetted Jagan

Tdp party targetted jagan

Jagan, TDP, Ministers, Special Status, jagan will go to jail, Corruption, YS Rajashekar Reddy, AP, Chandrababu Naidu

TDP party targetted Jagan. AP Ministers slams Jagan for special status drama. Ayyana pathrudu and krishna murthy ald other ministers attacked on Jagan.

ఏపికి శనిలా మారిన జగన్

Posted: 09/24/2015 08:21 AM IST
Tdp party targetted jagan

ఏపి మంత్రులు ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడికి దిగారు. జగన్ తలపెట్టదలిచిన దీక్ష మీద, పార్టీ మీద తమదైన స్టైల్లో మండిపడ్డారు. కపట దీక్షకు సిద్ధమవుతున్న జగన్‌ రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. తన తండ్రి వైయస్ హయాంలో లక్షల కోట్లు దోచుకున్న జగన్‌కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. నవ్యాంధ్రకు జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనిలా దాపురించారని మండిపడ్డారు. సీఎం కావాలని జగన్‌ కలలు కంటూ రాష్ట్రంలో యవతను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై మంత్రులకు అవగాహన లేదని జగన్‌ అంటున్నాడని చెప్పారు. అసలు ఆయనకే అవగాహన లేదని, ఉంటే ఇలా మాట్లాడరని అన్నారు. జగన్‌ అతి త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఆయన అవినీతికి పాల్పడిన లక్ష కోట్ల సొమ్మును ప్రజా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు నోరు మెదపని జగన్‌.. ఇప్పుడు అవకాశం దొరికిందని నిందలు వేస్తున్నాడన్నారని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చేది ప్రధాని మోదీనని, ఆయన వద్ద ఆందోళన చేస్తేనే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.

మరో మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా జగన్ పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. ఆయన ప్రత్యేక హోదాపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర  వై.ఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ లక్షలాది ఎకరాలు కాజేసి కోట్లు కూడగట్టుకున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆయనకు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ దీక్షలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని, ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదిరించి కోట్లు కొల్లగొట్టాడని, ఆఖరికి వారిని జైలు పాలు చేశారని తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు పేరుతో ఈ లేఖ విడుదలైంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి జగన్‌ దీక్షలు చేస్తున్నాడని టీడీపీ విమర్శించింది. ఆయన మొసలి కన్నీరు కారిస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దీనిపై రూట్‌ మ్యాప్‌ తయారు చేయాలని ప్రధాని నీతి అయోగ్‌ను ఆదేశించారని తెలిపారు. దాని తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నీతి అయోగ్‌తో సమావేశమై కొంత కసరత్తు చేశారని పేర్కొన్నారు. విభజనతో రెక్క విరిగిన రాషా్ట్రన్ని మళ్లీ నిలబెట్టడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే జగన్‌ హడావిడి చేసి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles