A muslim teenager arrested after a texas teacher mistook his homemade clock for a bomb won invitations to the white house

Ahmed Mohamed, Muslim, teen, homemade clock, islamophobia, World, Facebook, google, Obama

A Muslim teenager arrested after a Texas teacher mistook his homemade clock for a bomb won invitations to the White House, Google and Facebook Wednesday in a surge of public support. President Barack Obama congratulated Ahmed Mohamed, 14, on his skills in a pointed rebuke to school and police officials -- who defended his arrest -- amid accusations of Islamophobia.

ఆ కుర్రాడికి ఒబామా, ఫేస్ బుక్, గూగుల్ ఆహ్వానం

Posted: 09/17/2015 05:23 PM IST
A muslim teenager arrested after a texas teacher mistook his homemade clock for a bomb won invitations to the white house

చదువుతున్నది కేవలం తొమ్మిదో తరగతి మాత్రమే కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గరి నుండి ప్రత్యేకంగా ఆహ్వానం అందుకున్నారు. ఒబామా ఒక్కడే కాదు ఫేస్ బుక్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆ కుర్రాడిని ఆహ్వానిస్తున్నాయి. మా దగ్గరికి రా.. నీ ఆలొచనలను పంచుకో అంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి. ఇంతకీ అంతలా కుర్రాడు ఏం చేశాడు అనుకుంటున్నారా..? ఆ కుర్రాడు ఓ అలారం గడియారాన్ని తయారు చేశారు. అయితే ఆ గడియారాన్ని చూసిన ఉపాధ్యాయులు మాత్రం అదేదో బాంబ్ అంటూ భయపడిపోయి.. పోలీసులకు సమాచారం పంపడం.. వారు అతన్ని అరెస్టు చెయ్యడం టకటకా జరిగిపోయాయి. అయితే ఈ వీడియో నెల్ లో హల్ చల్ చెయ్యడంతో అందరి దృష్టి ఆ కుర్రాడి మీదకు మళ్లింది. అమెరికాలోని తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ అనే కుర్రాడు ఇప్పుడు ఇంటర్నెట్ లో కొత్త హీరోగా మారాడు.

ఉపాధ్యాయులు, పోలీసులు చేసింది పొరపాటు అని తెలిసింది. ఈవిషయం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెలిసి ఆ బాలుడిని ఏకంగా తన ఇంటికి ఆహ్వానించాడు. పద్నాలుగేళ్ల వయసులో అతడు చేసిన నూతన ఆవిష్కరణకు ముగ్దుడైపోయారు. అతడిలాంటి శాస్త్రవేత్తలే అమెరికాకు కావాలని పొగుడుతూ ట్వీట్ చేశారు. నూతన ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని మరింత ప్రోత్సహించాలే తప్ప సంకెళ్లు వేయకూడదని అన్నారు. మరోపక్క, ఫేస్ బుక్ అధినేత కూడా ఆ కుర్రాడిని పొగడ్తల్లో ముంచెత్తడు. తన ఆవిష్కరణలు అలాగే కొనసాగించమని, ఆ బాలుడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తనను నిరభ్యంతరంగా కలవొచ్చని ఆహ్వానించాడు. ఒక్క ఒబామా మాత్రమే కాదు ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ కూడా తన ఆఫీసుకు ఆహ్వానించారు. అలాగే గూగుల్ కూడా తన కోసం ఓ కుర్చీ సిద్దంగా ఉందని.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేందుకు సిద్దంగా ఉండాలని ఆశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahmed Mohamed  Muslim  teen  homemade clock  islamophobia  World  Facebook  google  Obama  

Other Articles