Srikrishna temple in Guntur with 150cr

Isckon constructing srikrishna temple in guntur with 150cr

Isckon, Srikrishna, Golden Temple, Golden Temple In AP, Modi, Isckon temples

Isckon constructing Srikrishna temple in Guntur with 150cr. Isckon already took the blue print of the temple and getting ready to start in the Dassara.

శ్రీకృష్ణుడికి బంగారు దేవాలయం.. అది 150 కోట్లతో

Posted: 09/14/2015 04:43 PM IST
Isckon constructing srikrishna temple in guntur with 150cr

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కోట్లతో కృష్ణ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఇస్కాన్ నిర్వాహకులు. గుంటూరు జిల్లాలో ఏకంగా 150 కోట్లో బంగారు దేవాలయాన్ని నిర్మించాలని.. అది కూడా అన్ని అత్యాధునిక హంగులతో ఆలయాన్నిసిద్దం చెయ్యడానికి ఇస్కాన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఇస్కాన్ తెలిపింది. విజయదశమినాడు స్వర్ణమందిరం ఏర్పాటు పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నట్లు సమాచారం. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతానికి ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. చారిత్రక వెన్నముద్దల వేణుగోపాస్వామికి ఈ ప్రతిష్టాత్మక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ఆలయం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయి. ఇంకా వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీన శాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లతో అంచనాలు రూపొందించామని ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు. మొత్తానికి ఏపిలో కూడా అమృత్ సర్ తరహా గోల్డెన్ టెంపుల్ రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isckon  Srikrishna  Golden Temple  Golden Temple In AP  Modi  Isckon temples  

Other Articles