Gaddar about warangal elections

Gaddar gave clarity on contesting in the warangal elections

Gaddar, Warangal, Elections, CPI, CPM, Gaddar in Elections, Telangana

Gaddar gave clarity on contesting in the warangal elections. Gaddar said that he donot contesting in the elections in this time.

వరంగల్ ఎన్నికల్లో పోటీపై గద్దర్ మాట..

Posted: 09/14/2015 04:20 PM IST
Gaddar gave clarity on contesting in the warangal elections

అతను పాట పాడితే.. ఒళ్లు జలదరిస్తుంది. ఒంట్లోని రక్తం ఉప్పొంగుతుంది.. వెంట్రుకలు ఆవేశంతో నిక్కపొడుచుకుంటాయి.. అతనే కదిలే ఉద్యమ నావ, ప్రజా గాయకుడు గద్దర్. అయితే గద్దర్ వరంగల్ ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొంత కాలంగా వస్తున్న పుకార్ల మీద గద్దర్ క్లారిటీ ఇచ్చారు. వామపక్షాల తరఫున గద్దర్ వరంగల్ బరిలోకి దిగుతారని గత కొంత కాలంగా గట్టిగా ప్రచారం సాగుతోంది. గద్దర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని... మిగిలిన పార్టీ నాయకులను ఒప్పించి పోటీ లేకుండా యునానమస్ గా ఎన్నికల కావాలని గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని కూడా గత కొంత కాలంగా జోరుగా ప్రచారం నడుస్తోంది. మరి దీని మీద గద్దర్ ఎట్టకేవలకు క్లారిటీ ఇచ్చారు. మరి గద్దర్ ఏం మాట్లాడారో తెలుసా..? అయితే స్టోరీ చదవండి.

‘‘ప్రజలను రాజకీయ శక్తిగా ఏకం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను సమీకరించేందుకు నేను పనికి వస్తానా లేదా ఆలోచిస్తున్నా . తెలంగాణ మనకు కాని ఉద్యమం. రాజకియ పార్టీ గా ఎదగడానికి అన్ని శక్తులు  ముందుకు రావాలి. కులం ఉత్పత్తి విధానం.  గద్దర్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, ఏదో ఓ పార్టీ తో పోటి చేయాలా. నేను బుద్ధిస్ట్ ను. మా తండ్రి బుద్ధిస్ట్. నేను ఎరుపు, పసుపు,నీలి జెండాలను మోయను. నా జెండా బుద్ధిస్ట్ జెండా.నా మిగిలిన జీవితంలో మన ప్రజలకు రాజ్యాధికారాన్ని తేగలమా. రెండు రాష్ట్రాల భూస్వాములు ఏకమయ్యారు.ప్రస్తుతం నేను ఉద్యమ పాటగా ఉండిపొతాను.ఎంపీ ఎన్నికల్లో గడ్డి  పొచను నిలిపినా గెలిపించ’’ వచ్చని గద్దర్ అన్నారు. మొత్తానికి తాను రాజకీయాల్లో స్వయంగా పోటీ చెయ్యడం లేదని గద్దర్ స్పష్టం చేసి సస్పెన్స్ కు తెర దించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gaddar  Warangal  Elections  CPI  CPM  Gaddar in Elections  Telangana  

Other Articles