Ridiculous: Man divorces wife after catching her dancing

Man divorces wife for dancing

Man divorces wife, Man divorces wife for dancing, Man divorces wife for bedwetting, Man divorces wife for being ugly, saudi arabia, woman, wife, divorce, marriage, wedding, television, dancing, god channels

A Saudi man has divorced his wife with immediate effect after meeting her dancing at home in front of their television.

భార్య ‘ఆ కార్యం’ చేస్తుంటే.. భర్త చూసి విడాకులిచ్చాడు..

Posted: 09/11/2015 08:12 PM IST
Man divorces wife for dancing

గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, వారు ప్రస్తుతం స్వేచ్ఛగా జీవిస్తున్నారని చాలామంది వాదిస్తుంటారు. అయితే ఇప్పటికీ చాలామంది మహిళలు వివాహం తర్వాత తన భర్త మనసెరిగి నడుచుకోవాల్సిందే. లేకపోతే వారికి శిక్ష తప్పదు. తన అభీష్టానికి భిన్నంగా ప్రవర్తించదనే కారణంతో భార్యకు విడాకులిచ్చాడో భర్త. తాను వద్దన్నా వినకుండా డాన్స్ చేసిందనే సాకుతో వివాహ బంధాన్ని తెంచుకున్నాడు. టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన పాటకు డాన్స్ చేయడమే ఆమె చేసిన అపరాధమని తన ఇంట్లో నుంచి గెంటివేశాడు.. అరబ్ దేశం సౌదీ అరేబియాలో ఈ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఖతార్‌లో. తనకు నచ్చని పని చేసిందని ఏకంగా విడాకులే ఇచ్చేశాడో ప్రబుద్ధుడు. తాను వద్దని చెప్పినా.. వినకుండా డాన్స్ చేసిందని వివాహ బంధానికే స్వస్తి పలికాడు.
 
భక్తి చానళ్లు తప్ప వేరే చానళ్లు ఏవీ చూడకూడదని పెళ్లైన కొత్తలోనే ఆమె చేత ప్రమాణం చేయించుకున్నాడు సదరు భర్త. అయితే ఓ చానళ్లో తనకిష్టమైన పాట వస్తుండడంతో తనను తాను తమాయించుకోలేక ఆమె కాలు కదిపింది. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ నుంచి వచ్చిన భర్త అది చూసి కోపోద్రిక్తుడయ్యాడు. నా అజ్ఞను పట్టించుకోవా.. అంటూ అమెను ఇంటి నుంచి గెంటేశాడు. వెంటనే విడాకులు కూడా ఇచ్చేశాడు. పెళ్లినాటి ప్రమాణాలు మరచి తనను మోసం చేసిన భార్యను క్షమించేది లేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ఈ విషయాన్ని వెల్లడించిన సౌదీ మీడియా.. ఆ భార్యాభర్తలు వివరాలు మాత్రం వెల్లడించలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saudi arabia  woman  wife  divorce  marriage  wedding  

Other Articles