Ragging in Nellore

One more rahhing case in nellore dist

Ragging, Nellore,AP, Rishiteshwari, Priyadarshini College

One more Rahhing case in Nellore dist. In Priyadarshini engineering college, senior students ragging junior student.

ITEMVIDEOS: నెల్లూర్ లో మరో ర్యాగింగ్ ఘటన

Posted: 09/11/2015 04:37 PM IST
One more rahhing case in nellore dist

ర్యాగింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. రోజురోజుకూ ర్యాగింగ్ సంఘటనలు పెరిగుతున్నాయి. ర్యాగింగ్ కారణంగా కొంత మంది విధ్యార్ధులు ప్రాణాలు కోల్పోతుంటే... మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులోని ఓ ఇంజనీరంగ్ కళాశాలలో ఓ విధ్యార్ధిపై జరిగిన ర్యాగింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ మడలం, కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకాంత్ అనే విధ్యార్ధి పై తన తోటి విధ్యార్ధులే ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. ప్రతిరోజు శ్రీకాంత్ ను పలురకాలుగా కామెంట్ లు చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. దీంతో శ్రీకాంత్ కళాశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన తోటి విద్యార్ధులు... శ్రీకాంత్ ను బాత్ రూంలో నిర్బందించి చిత్రహింసలకు గురిచేశారు.

ఈ విషయంపై శ్రీకాంత్ కళాశాల సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు కాలేజ్ వద్దకు వచ్చి సిబ్బందిని జరిగిన విషయం పై నిలదీశారు. తమ బిడ్డ పై ర్యాగింగ్ కు పాల్పడిన చరణ్, సుదీర్, శ్రావణ్, శశి లను పిలిపించి వారిని నిలదీశారు. విషయం తెలుసుకున్న విధ్యార్ధి సంఘాలు కాలేజ్ వద్దకు చేరుకుని యాజమాన్య నిర్లక్ష్యం పై ఆందోళనకు దిగారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాడ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragging  Nellore  AP  Rishiteshwari  Priyadarshini College  

Other Articles