Sheena Bora case: Rakesh Maria receives official communication on ‘supervisory role’

Rakesh maria expresses unwillingness to investigate sheena bora case

Rakesh Maria, Ahmed Javed, Mumbai Police Commissioner, DGP, uddav thakary, Chief minister devendra fadnavis, DGP home guards, sheena bora murder case, rakesh maria, rakesh maria transfer, rakesh maria sheena bora, maria transfer, minister of State for Home Ram Shinde, ACB

For this particular case, the investigation officers will report to Rakesh Maria only as he has been asked to supervise the probe," said minister of State for Home Ram Shinde.

షీనాబోరా కేసు నీరుగారనుందా..? కేసు దర్యాప్తు చేసేదెవరు..?

Posted: 09/10/2015 04:04 PM IST
Rakesh maria expresses unwillingness to investigate sheena bora case

గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనాబోరా కేసును నిఫ్పాక్షపాతంగా దర్యాప్తు చే్స్తున్న క్రమంలో ఉన్నఫలంగా తనను బదిలీ చేయడంతో మనస్సు నోచ్చుకున్న మాజీ ముంబై పోలీసు కమీషనర్, ఐఎఎస్ అధికారి, ముంబై డీజీపీ రాకేశ్ మారియా.. షీనాబోరా కేసును తాను దర్యాప్తు చేయడంపట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పాము తన గుడ్లను తానే తినేసినట్లు ఓ పారిశ్రామిక వేత్త తన కూతురు ఆస్తి కాజేయడానికి.. క్రూరమృగంగా మారి అమెను అతిదారుణంగా హతమార్చారన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.

ఈ కేసులో మృతి చెందింది షీనాబోరానేనని, అమె పారిశ్రామికవేత్త ఇంద్రాణి కూతరనడానికి కూడా డీఎన్ఏ పరీక్షల నివేదికలు తెప్పించి రమారమి కేసు దర్యాప్తులో కీలక బాగాన్ని విచారించిన సాక్ష్యాధారాలను సమకూర్చుకున్న రాకేశ్ మారియా.. తాను బదిలీ కావడంతో ఈ కేసును దర్యాప్తును కొనసాగించడానికి అసంతృప్తి వ్యక్తం చేశారు. షీనా బోరా కేసును మాత్రం రాకేశ్ మారియానే విచారిస్తారని ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు ఆయనకు కేసు దర్యాప్తు చేయాలని అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా, షీనా బోరా కేసును విచారించేందుకు రాకేశ్ మారియా నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాను డీజీపీ హోంగార్డ్స్ గా బాధ్యతలను చేపట్టి, కార్యాలయాన్ని కూడా మార్చిన నేపథ్యంలో తాను ఈ కేసును దర్యాప్తు చేయడానికి అయిష్టత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించినట్లు సమాచారం. ముంబై పోలీస్ కమీషనర్ గా సమాన స్థాయి హోదా కలిగిన మరో ఐఎఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తరుణంలో తాను ఈ కేను దర్యాప్తు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు.

ఇలా చేస్తే ముంబై పోలీసు వ్యవస్థలో కొత్తగా మరో పవర్ సెంటర్ ఏర్పాడే అవకాశముంది. ఇది పోలీసు వ్యవస్థకు కూడా సహేతుకం కాదని అయన అభిప్రాయపడ్డారు. ఇలా చేస్తే.. కిందిస్థాయి సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది' అని ప్రభుత్వానికి మారియా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.దీంతో ఈ కేసు అటకెక్కినట్లేనా.. అన్న అనుమానాలను పలువురి వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం మారియాకు పదోన్నతి కల్పించిందన్న వార్తల నేపథ్యంలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును ఇకపై విచారించే అధికారి ఏవరన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakesh Maria  Ahmed Javed  Sheena Bora case  investigation  

Other Articles