Assam MLA Gopinath Das accused of raping minor girl who worked as domestic help | Rape Incidents

Assam mla gopinath das accused of raping minor girl

Assam MLA Gopinath Das, mla gopinath rape case, minor girl mla gopinath rape case, mla gopinath latest updates, mla gopinath controversy, mla gopinath latest updats, rape case india, guwahati rape case, mla guwahati rape case

Assam MLA Gopinath Das accused of raping minor girl : The 14-year old girl had filed an FIR with the Mandira outpost, under Boko police station, on August 29 last that she was raped by the MLA inside his car in Guwahati

ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు.. కాదు కుట్ర!

Posted: 09/07/2015 06:58 PM IST
Assam mla gopinath das accused of raping minor girl

ప్రజాసేవే తన లక్ష్యమంటూ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ఓ నాయకుడు మైనర్ బాలికను చెరిచాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ నీచుడు కన్నకూతురితో సమానమైన తన ఇంట్లో పనిచేసే అమ్మాయిపైనే అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని గౌహతిలో వెలుగుచూసింది.

అసోంలోని ఏఐయూడీఎఫ్ కు చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ పై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. ఆ ఇంట్లోనే పనిచేసే బాలికపై గోపినాథ్ అత్యాచారానికి పాల్పడ్డారని, ఈమేరకు బాధితురాలు బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని మంది ఔట్ పోస్టులో గత నెల 29న ఫిర్యాదు చేసింది. గౌహతిలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేసినట్లుగా ఆ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. తొలుత ఈమె ఫిర్యాదును పోలీసులు అంగీకరించలేదు. అయినప్పటికీ ఆ మైనర్ బాలిక తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూరాలని కోరుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. దీంతో స్పందించిన పోలీసులు.. వెంటనే కేసు నమోదు చేయకుండా తమదైన రీతిలో దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా వారికి ఆశ్చర్యకరమైన నిజాలు తెలియడంతో.. ఆ మైనర్ బాలిక ఫిర్యాదును స్వీకరించి, ఆ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే.. తనమీద వచ్చిన ఈ అత్యాచార ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని గోపీనాథ్ ఖండించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఆ బాలిక తమ ఇంటి నుంచి కొన్ని వస్తువులు దొంగలించి పారిపోయిందని ఆ ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో డైలామాలో పడ్డ పోలీసులు.. ఆ బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారని తెలిసింది. ఈ కేసు చిక్కుముడి ఎన్నడూ వీడుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam MLA Gopinath Das  Minor Girl Rape Case  Guwahati Crime news  

Other Articles