AP | Thunderbolt | 23Died

Rains in telugu states brougt tears in some families

AP, Thunderbolt, 23Died, Telangana, Hyderabad, Rains

Rains in Telugu states brougt tears in some families. In AP 23 members died by Thunderbolt. yesterday heavy rains in Hyderabad also.

వర్షం కురిసింది కానీ విషాదం తెచ్చింది

Posted: 09/07/2015 09:26 AM IST
Rains in telugu states brougt tears in some families

ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి 23 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఇద్దరు పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గానుగపెంటలో పిడుగు అత్తా కోడళ్లను బలి తీసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తిలో తండ్రి కొడుకులు చనిపోయారు. కృష్ణా జిల్లా రెడ్డి గూడెం మండలం కూనపరాజు పర్వలో దగ్గరి బంధువులు ఇద్దరూ ఒకేచోట ఉన్న టైంలో పిడుగుపడి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇలా కోస్తా అంతటా పిడుగుల వర్షం కురిసింది. పెను విషాదం నింపింది. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం అమ్మవలస దగ్గర వాగు పొంగి 25 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

తాజా పరిస్థితిని సిఎం చంద్రబాబు సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఏపీ మీద బలంగా ఉంది. రాష్ట్రమంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం రేపు కూడా ఉంటుందని ప్రకటించింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇన్నాళ్ళు చుక్క నీరు లేక అల్లాడిపోయిన రైతులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఖరీఫ్‌లో కనీసం మెట్ట పంటలైనా వేసుకోవచ్చన్న ఆనందంలో ఉన్నారు రైతులు. కాగా నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం భీభత్సాన్ని సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Thunderbolt  23Died  Telangana  Hyderabad  Rains  

Other Articles