American Progressive Telugu Association | APTA

American progressive telugu association apts is a non profit organization and is indo american national level organisation

American Progressive Telugu Association, America, telugu people, APTA Conference, Maryland, California, APTA, America, telugu people, APTA Conference, Maryland, California

, America, telugu people, APTA Conference, Maryland, California is a non profit organization and is one of oldest Indo American national level organisation primarily for networking of Telugu people in the America.

అమెరికాలో ‘ఆప్తా’ ఆపన్నహస్తం

Posted: 09/01/2015 04:49 PM IST
American progressive telugu association apts is a non profit organization and is indo american national level organisation

అమెరికాలో తెలుగు వారికి అండదండా నిలుస్తూ వారి అభివృద్దికి అహర్నిషలు కృషిచేస్తున్న సంస్థల్లో ఆప్త పేరు ముందుంటుంది. అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్ పేరుతో స్థాపించిన ఓ సంస్థ అమెరికాలో ఎంతో మంది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా అక్కడ ఉంటున్న వారికి తమ చేతినందించి, వారి అభివృద్దిలో పాలుపంచుకోవడం నిజంగా అభినందనీయం. తాజాగా మేరీల్యాండ్ లో ఐదు, ఆరు తేదీలలో జరిగే ప్రాంతీయ సమావేశాలు జరనున్నాయి. అమెరికాలో తెలుగు వారి ప్రభను మరింత విస్తరిచేస్తున్న ఆప్తా సమావేశాల నేపథ్యంలో సమావేశాలు విజయవంతం కావాలని, ఆప్తా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ తెలుగు వారి ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాం.


ఆప్తా గురించి కొన్ని విషయాలు..

Founder Board Chair:           ప్రసాద్ సమ్మెట (కాన్సాస్)
Founder Exec. President:     శ్రీనివాస్ చందు (వర్జీనియా)
Present Board Chair:           శ్రీనివాస్ చిమట (క్యాలీఫోర్నియా)
Present Exec. President:      వెంకట్ చలమలశెట్టి (వర్జీనియా)


* అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో 2008 లో ఏర్పడింది  
* ఆప్తా సమావేశాలు 2009 నుండి విజయవంతంగా జరుగుతున్నాయి. మొదటి సమావేశాలు వర్జీనియా రాష్ట్రంలో ఎంతో అట్టహాసంగా .జరిగాయి.
* 2009 నుండి ఆప్తా రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తూ, తెలుగు వారి సేవలో తరిస్తోంది.
* ఆప్తాలో స్టూడెంట్స్ ఫోరం, బిజినెస్ ఎక్సిక్యూటివ్ ఫోరం, లీగల్ ఫోరం, మెడికల్ ఫోరం, ప్రొఫెషనల్స్ ఫోరం, ఉమెన్స్ ఫోరంలు ఉన్నాయి. ఇవన్నీ సమన్వయంతో పని చేస్తూ ఆప్తాను తెలుగు వారి సేవలో ముందుండేలా చేస్తోంది.
* ఆర్దిక సహాయం లేక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది పేద విద్యార్ధులకు ఆప్తా ఆసెప్ ప్రొగ్రాము ద్వారా చేస్తున్న ఈ సహాయం ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతోంది.  
* అమెరికాలో అవకాశాలు చాలా ఎక్కువైతే భారతీయులకు ఐడియాలు ఎక్కువ, సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చెయ్యటానికి ఒక మంచి ఐడియాతో సంస్థని ప్రారంభించటం గొప్ప విషయం.


ఆప్తా ఎందుకు స్థాపించారంటే...

తెలుగు వారిని అన్ని రకాలుగా అండగా నిలవడానికి, ఎక్కడైనా తెలుగు వారి సంసృతిని, సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అమెరికన్ ప్రోగ్రెస్సివ్ తెలుగు అసోసియేషన్ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఆప్తా విద్య, సామాజిక, ఆర్థిక, సాంస్రృతిక, ప్రాంతీయ అంశాల్లో తెలుగు వారిని ఏకంగా చెయ్యడమే ఆప్తా లక్ష్యం. ఒకరితో ఒకరు కలిసి శక్తిగా ముందుకు కదిలేందుకు ఆప్తా అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది.

ఆప్తా స్వల్పకాల లక్ష్యాలు....

* పేదరికం కారణంగా చదువకోవడంలో వెనుకబడిన ఉత్తమ విద్యార్థులకు ఆప్తా అండగా నిలుస్తోంది.
* విద్య, సమాజ సేవ, స్పోర్ట్స్, సాహిత్యంతో పాటు పలు రంగాల్లో మెరికల్లాంటి వారిని గుర్తించి వారి టాలెంట్ కు గుర్తుగా అవార్డులను ప్రధానం చెయ్యడం.
* సివిల్స్ లాంటి ఉన్నత ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతున్న టాలెంటెడ్ స్టూడెంట్స్ ను ఆప్తా మరితం ప్రోత్సహిస్తుంది.
* స్థానికంగా ఉండే ఆరోగ్య సంస్థలతో కలిసి భారత్ లో ఆరోగ్య రక్షణ కల్పించడం.
* ఉద్యోగార్థుల కోసం ఓ సలహా మండలిని ఏర్పాటుచేసి వారికి చేయూతనివ్వడం.
*హెచ్ 1, ఇమిగ్రేషన్ వ్యవహారంలో తలెత్తె సమస్యల మీద సలహా మండలిని ఏర్పాటు చేసి సహాయం చెయ్యడం.
* ఉన్నత చదువలకు, ఉద్యోగాలు చేసేందుకు అమెరికాలోని వారికి తోడ్పడటం.
* యుఎస్ లో ఉన్న వారికి వివాహ సంబందాలకై ఓ టీంను ఏర్పాటు చెయ్యడం.
*అమెరికాలో ఉంటున్న వారికి అన్ని రకాల న్యాయసలహాలు, సూచనలు ఇవ్వడానికి ఓ టీంను ఏర్పాటు చెయ్యడం.
* తక్కువ ఖర్చుతో విద్యార్థులకు, సందర్శకులకు ఇన్పూరెన్స్ కల్పించడం.
* మీడియా, విదేశీ వ్యవహారాల మీద ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చెయ్యడం.
* బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ లను గుర్తించడం, వారిలో ఆప్తా సభ్యలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం.
* వెబ్ సైట్ మేనేజ్ మెంట్ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు
* న్యూస్ లెటర్, మ్యాగజీన్ మేనేజ్ మెంట్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
* క్వార్టర్లీ మీటింగ్ లను ఏర్పాటు చెయ్యడం.
* సామాజికంగా అందరిని కలిపేలా టూర్లు, సాంస్రృతిక కార్యక్రమాలను నిర్వహించడం.
* అమెరికాలో, ఇండియాలో ఉంటున్న వారికి సహాయం చెయ్యగలిగే వ్యక్తులను గుర్తించడం, వారి సహకారం తీసుకోవడం.

ఆప్తా దీర్ఘకాల లక్ష్యాలు..

* 2020 నాటికి పది వేల కుటుంబాలతో ఆప్తా కలిసి పని చెయ్యడం.
* రాజకీయ సలహా మండలిని ఏర్పాటు చేసి అమెరికా, ఇండియాలో ఆప్తాను మరింత విస్తరించడం.
* బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్ లను గుర్తించి, వారిని ఒకరితో మరొకరిని కలపడం.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూడు రోజులపాటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమావేశాలు నిర్వహించడం.
* ఆప్తా కార్యక్రమాల్లో ప్రజలను బాగస్వాములను చెయ్యడం.
* ఇండియాలో వృద్దాశ్రమాన్ని ఏర్పాటు చెయ్యడం
* ఆప్తా ఎన్నారై స్కూల్స్, ప్రత్యేక శిక్షణ కేంద్రాలను, ఓ యూనివర్సిటిని ఏర్పాటు చెయ్యడం.
* ఆప్తా స్టూడెంట్స్ హాస్టల్స్, రెస్కూ సెంటర్లు ఏర్పాటు చెయ్యడం.
* ఆప్తా తరఫున ఇండియాలో మెడికల్ సెంటర్లను ఏర్పాటు చెయ్యడం.
* లాభాపేక్ష్ లేకుండా రియల్ ఎస్టేట్ ద్వారా ఇళ్లు లేని వారికి ఇళ్లు కల్పించడం

మరిన్ని వివరాలకై చూడండి... ఆప్తా వెబ్ సైట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles