Telangana | Liquior Policy | Beer | new policy

Telangana govt bringing new liquior policy for the liquior consumers

Telangana, Liquior Policy, Beer, new policy, KCR, Beer factory, Liquior

Telangana govt bringing new liquior policy for the liquior consumers. Telangana govt likely to encourage and spread beer and bevarages industries in the state.

తెలంగాణలో మందు రెడీ.. మంచింగ్ రెడీనా..?

Posted: 08/29/2015 08:51 AM IST
Telangana govt bringing new liquior policy for the liquior consumers

చిన్నప్పుడు కుటీర పరిశ్రమ అంటే ఏదో కర్రబొమ్మలు తయారు చెయ్యడం లేదంటే గంపలు తయారు చెయ్యడం అని చదువుకున్నాం. కానీ ఇక మీదట మన పిల్లలకు కుటీర పరిశ్రమ అంటే బీర్ తయారీ కేంద్రాలు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిపాదన అలాంటిది. త్వరలోనే  బీరు కూడా కుటీర పరిశ్రమగా మారబోతోంది! బార్ అండ్  రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల యజమానులతోపాటు ఎవరైనా సొంతంగా బీరు తయారుచేయవచ్చు. వారి సొంత బ్రాండ్‌తోనే దాన్ని దర్జాగా ఆమ్ముకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. వాటర్ ప్లాంట్ మాదిరి ఓ బీరు ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే సరి! ప్లాంటుకు వెయ్యి చదరపు మీటర్ల స్థలం చూపి ఎవరైనా ఇలా బీరు తయారు చేసేందుకు అనుమతి పొందొచ్చు. ఈ తరహా బీరు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పటిదాకా పబ్బుల్లోనే లభించే డ్రాట్ బీర్లు ఇకపై బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, గల్లీల్లో కూడా కనిపించనున్నాయి. అక్టోబర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పర్యాటక ప్రాంతాల్లో ఈ బీర్లు అందుబాటులోకి రానున్నాయి.

మొత్తానికి మద్యం అంటే తెలియని వ్యక్తులకు కూడా ప్రభుత్వం బీరు పాఠాలు నేర్పుతోంది. కుటీర పరిశ్రమగా బీర్, మందులను తయారు చేయించి.. ప్రజలు వాటిని తాగి మత్తులో ఉంటే ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ సర్కార్. కొత్త పాలసీలో మద్యాన్ని చవకగా అమ్మేందుకు ఇంత వరకే అన్ని ప్రతిపాదనలు సిద్దంకాగా తాజాగా కుటీర బీర్ పరిశ్రమ గురించి అన్ని రాజకీయ పార్టీల్లో వాడివేడి చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త మద్యం విధానంతో రాష్ట్ర ఖజానా గలగలలాడనుంది. కొత్త పాలసీ ప్రకారం మండలం యూనిట్‌గా ఒక షాపును నిర్ధారిస్తే ఆబ్కారీ ఆదాయం మరింత పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం 2200 మద్యం షాపులు ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఆ షాపుల సంఖ్య 2500 వరకు పెరిగే అవకాశం ఉంది. మండలం యూనిట్‌గా మద్యం షాపులు ఏర్పాటు కానున్నాయి. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోను సర్కారీ మద్యం షాపులు వస్తాయి. 2014-15 మద్యం విధానం ప్రకారం తెలంగాణలో రూ.9013 కోట్ల ఆదాయం వస్తున్నది. 2015-16 కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏకంగా 14వేల కోట్లకు పైనే మద్యంపై ఆదాయం రావాలన్నది ప్రభుత్వం అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Liquior Policy  Beer  new policy  KCR  Beer factory  Liquior  

Other Articles