Flowers | Prices | Varalakshmi Vratam

Flowers prices increased in telugu states

Flowers, Prices, Varalakshmi Vratam, Hyderabad, Viajayawada

Flowers prices increased in telugu states. On the Occasion of Varalakshmi Vratam, Flowers prices reach peaks.

పువ్వులు ధరలు పీక్స్.. చామంతి @700

Posted: 08/28/2015 12:42 PM IST
Flowers prices increased in telugu states

అసలే శ్రావణ శుక్రవారం.. తెలుగు వారు ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహించే వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా కావాల్సినవి పువ్వులు. ఏ వస్తువులు ఉన్నా లేకున్నా పూజకు పువ్వులు మాత్రం ఉండాల్సిందే. మరి ఆడవాళ్లు ఎందులో అయినా కాంప్రమైస్ అవుతారేమో కానీ పూజలో పువ్వుల దగ్గర మాత్రం అస్సలు కారు. ఎంత ఖర్చైనా సరే పువ్వులు తీసుకురావాల్సిందే. మరి శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో మార్కెట్ లో పువ్వుల రేట్లకు రెక్కలు వచ్చాయి. మొన్నటి దాకా వంద రెండు వందలు పెడితే బ్యాగ్ నిండా పువ్వులు వచ్చేవి కానీ ఇప్పుడు మాత్రం పువ్వుల ధరలు అమాంతంగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ లాంటి నగరాల్లో అయితే మరీ భయంకరంగా మండుతున్నాయి.

హైదరాబాద్ లో పువ్వులు ఉన్న వాళ్లకు బాగా డిమాండ్ వచ్చేసింది. తమ ఇష్టానుసారంగా రేట్లను పెంచేసి.. పువ్వులను అమ్మేస్తున్నారు. మామూలుగా అయితే గుడిమల్కాపూర్ లో విరివిగా దొరికే పువ్వుల కోసం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా కిలో పూల ధర పెరిగిపెరిగి సామాన్యుడికి అందనంతగా మారింది. గులాబీ పువ్వులు అయితే కనిపించడం లేదు. ఒకవేళ కనిపించినా ఒక్క పువ్వు 20 లేదంటే 30 అంటూ వ్యాపారస్తులు భయపెడుతున్నారు. చామంతి పువ్వులు ధర అయితే ఏకంగా 700ల దాకా వెళ్లడంతో అందరు జేబులు తడుముకుంటున్నారు. అయినా సీజన్ లోనే కదా కొనిదే అంటూ వ్యాపారులు తెగ సంబరపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flowers  Prices  Varalakshmi Vratam  Hyderabad  Viajayawada  

Other Articles