TSPSC | Second Notification

Tspsc ready to release one more notification for telangana unemployees

TSPSC, Notification, Jobs, Telangana, Ganta Chakrapany, KCR, Telangana Jobs

TSPSC ready to release one more notification for Telangana unemployees. TSPSC already released first notification ten days back, Now preparing to bring one more notification.

రేపు మరో నోటిఫిషన్ జారీకి టిఎస్ పీఎస్సీ సిద్దం

Posted: 08/28/2015 10:06 AM IST
Tspsc ready to release one more notification for telangana unemployees

ఎంతో కాలంగా నొటిఫికేషన్ల కోసం మొహం వాచేలా వేచి చూసిన నిరుద్యోగులకు శుభవార్త. టిఎస్ పీఎస్సీ ద్వారా ఇక నోటిఫికరేషన్ల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులకు టీఎస్‌ పీఎస్సీ మరో తీపి కబురు అందించింది. టీఎస్ పీఎస్సీ రేపు మరో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దీనిద్వారా ప్రజారోగ్య, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌లలో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ క్యాటగిరీల్లో 563 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులను భర్తీచేయనున్నారు. కమిషన్ సభ్యుల బృందం ఈ మేరకు మూడు ప్రభుత్వశాఖల్లోని ఇంజినీర్ కొలువుల భర్తీకి సంబంధించిన ప్రకటనను, సిలబస్‌ను ఖరారు చేసింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీనాటికి కనిష్ఠంగా 18 ఏండ్లు, గరిష్ఠంగా 44 ఏండ్ల వయసు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ సడలింపు ఉన్నవారికి ఆ మేరకు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 28. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానంలో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇప్పటికే తమ వివరాలను నమోదు చేసుకున్న వారు తమ వివరాలతో లాగిన్ అవ్వాలి. ఈ ఉద్యోగాల భర్తీకి చెందిన పూర్తి సిలబస్  కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షను అక్టోబర్ 25వ తేదీన నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్ష హైదరాబాద్‌లోనే (హెచ్‌ఎండీఏ పరిధి)లో మాత్రమే నిర్వహించనున్నారు. సవివర నోటిఫికేషన్ శనివారంనుంచి అందుబాటులో ఉండనుంది. పరీక్షలు జరిగిన రెండు వారాలలోపు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కమిషన్ తగు చర్యలు తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Notification  Jobs  Telangana  Ganta Chakrapany  KCR  Telangana Jobs  

Other Articles