Hyderabad Task Force Police Arrested Terrorist Gang Members In Hyderabad City | Delhi Terror Gang

Terrorists gang hyderabad city delhi gang task force police

hyderabad city, hyderabad blasts, hyderabad news, hyderabad terrorists, terrorists gangs in hyderabad, terror gang in delhi, pak terrorist nazeer

Terrorists Gang Hyderabad City Delhi Gang Task Force Police : Hyderabad Task Force Police Arrested Terrorist Gang Members In Hyderabad City

హైదరాబాద్ నగరంలో మరో ఉగ్రవాద ముఠా

Posted: 08/24/2015 12:35 PM IST
Terrorists gang hyderabad city delhi gang task force police

గతకొన్ని రోజుల నుంచి ఎవరికీ తెలియకుండా ఓ ఉగ్రవాద ముఠా హైదరాబాద్ నగరంలో సీక్రెట్ గా వున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాకి ఢిల్లీలోని తమ సహచరులతో కాంటాక్ట్‌లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చిందంటే.. సుమారు 15రోజుల క్రితం చంచల్‌గూడ ప్రాంతంలో ఓ పాక్ ఉగ్రవాద నజీర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికి, ఆ ముఠాకి వారికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం.

కేవలం అతనొక్కడే కాదు.. ఢిల్లీలో షేక్ నూర్, హజీమ్ అనే ఉగ్రవాదులను కూడా హైదరాబాద్ ‘సిట్’ పోలీసులు అరెస్ట్ చేసి సిటీకి తీసుకువచ్చారు. వారిరువురు నజీర్ గ్యాంగ్ సభ్యులేనని పోలీసులు అంటున్నారు. 15రోజుల క్రితం విచారణ జరపకుండా పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం వెలుగులోకి రావడంతో అలర్ట్ అయిన పోలీసులు.. ఆ విచారణలో భాగంగా నజీర్‌ను పట్టుకున్నారు. అతనితోబాటు ఫైజల్ మహ్మద్, జోనల్ అబేదిన్, జియావుర్ రహమాన్ అనే వ్యక్తులను కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ విధంగా ఉగ్రవాదులు పట్టుబడిన నేపథ్యంలో.. ఇంకా ఉగ్రవాదులు ఎవరైనా వున్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరంతా ఢిల్లీ, హైదరాబాద్ లతో సహా ఇతర నగరాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా కూడా పోలీసులు తమ విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan terrorists  Hyderabad City  Delhi Crime news  

Other Articles