pawan kalyan meets penumaka farmers says

Pawan kalyan meets ap capital area village farmers

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, It is a crime against the nation - Pawan Kalyan

Pawan Kalyan, who extended his support to the farmers of AP capital amaravathi area, visits land aquisition village farmers, says i am there for you

పవన్ మీరే మా దేవుడు.. మీరు చెబితే భమూలిస్తాం.. పవన్ తో రైతులు

Posted: 08/23/2015 01:38 PM IST
Pawan kalyan meets ap capital area village farmers

నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతుల సమస్యలు వినడానికే వచ్చానని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ రాజధాని భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసిన గ్రామాల్లో పర్యటించిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తాడేపల్లి మండలం పెనుమాక చేరుకుని అక్కడ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మీ సమస్యలు వినడానికే వచ్చా... సహకరించండి' అంటూ విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ చేస్తే మీకు ఏంటి సమస్య అని పవన్ పశ్నించగా... అన్నదాతలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు.

ల్యాండ్‌ పూలింగ్‌కు తాము పూర్తి వ్యతిరేకమని, ఏపీ రాజధానికి తమ భూములు ఇవ్వబోమని పెనుమాక రైతులు స్పష్టం చేశారు. తమ భూములు ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ తమకు గిట్టుబాటు కాదని వారన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రభుత్వ అధికారులు, మంత్రులు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, స్వచ్చంధంగా భూములు ఇస్తే ప్రభుత్వం పరిహారం ఇస్తుందని, లేకపోతే భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకుంటామని... ఆ విధంగా చేస్తే మీకు నష్టమని మంత్రులు, అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ఏ బాధ వచ్చిన తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కుకునేవారమని, ఇప్పుడు మీరే మాకు దేవుడని రైతులు పవన్‌ కల్యాణ్‌ను వేడుకున్నారు. తమ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రికి తెలపాలని రైతులు పవన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ భూ సేకరణ చేస్తే మేం ఆత్మహత్యలు చేసుకోవాలని, వేరే దారి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ తమకు ఏ మూలకు సరిపోదని వారన్నారు. పవన్‌ రైతుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. బలవంతంగా భూములు లాక్కుంటున్నారని రైతులు ఆయనకు మొరపెట్టుకున్నారు. భూములు ఇవ్వకుండానే ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని వాపోయారు. భూసమీకరణపై స్పష్టత లేదన్నారు. ఉండల్లి, పెనుమాన ప్రాంతాల్లో పండిన పంటలను రైతులు పవన్ కల్యాణ్ కు చూపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  farmers  

Other Articles