pakistan | India | Kashmir | Separatists

India warns pakistan against meeting with kashmiri separatists

pakistan, India, Kashmir, Separatists, Kashmir Issue, India on Kashmir Issue

India Warns Pakistan Against Meeting With Kashmiri Separatists . India said it urged Pakistan against meeting Kashmiri separatist leaders ahead of rare high-level talks between the two countries.

పాక్ తో చర్చలు జరిపేది లేదు.. తేల్చిన భారత్

Posted: 08/22/2015 03:52 PM IST
India warns pakistan against meeting with kashmiri separatists

చర్చలంటూనే వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌తో జాతీయ భద్రతా సలహారుల స్థాయి చర్చలను రద్దుచేయాలని ఇండియా నిర్ణయించినట్లు సమాచారం. ఉగ్రవాదం అంశంపైనే చర్చలు జరుపాలని రెండు దేశాల ప్రధానులు నిర్ణయించినప్పటికీ తాజాగా పాకిస్థాన్ జమ్ముకశ్మీర్‌తోసహా ఇతర అంశాలను కూడా ఎజెండాలో చేర్చటంతో భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కాల్పులకు పాల్పడుతూ ఉగ్రవాదులను భారత్‌ భూభాగంలోకి పంపటమేకాకుండా పుండుమీద కారం చల్లినట్లుగా కశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ చర్చలకు ఆహ్వానించటం ఇండియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

తాజా పరిణామాలతో చిత్తశుద్ధిలేని చర్చలతో ప్రయోజనం ఉండదని పాకిస్థాన్‌కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఇండియా భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం అంశంపైనే జరుగాలన్న తమ విధానానికి కట్టుబడి ఉన్నామని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టంచేశారు. ఈ నెల 24న భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌దోవల్, పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తార్ అజీజ్ ఢిల్లీల్లో చర్చలు జరపాల్సి ఉంది. అయితే చర్చలు రద్దు చేస్తున్నట్టు ఎటువైపు నుంచీ అధికారిక ప్రకటన రాలేదు. అటు చర్చల విషయంలో తన బుద్ధి మారలేదని పాకిస్థాన్ నిరూపించుకొంది. చర్చల ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారీ జమ్ముకశ్మీర్ వేర్పాటువాదులను భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తున్న దాయాది దేశం.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసింది. చర్చలు ఇష్టంలేకనే పాకిస్థాన్ ఇలా పదేపదే వ్యవహరిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చర్చలంటూనే పాక్ కవ్వింపులకు పాల్పడుతూ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. రష్యాలోని ఉఫాలో భారత్, పాక్ ప్రధానులు నరేంద్రమోడీ, నవాజ్ షరీఫ్‌లు కలుసుకున్న సమయంలో ఉగ్రవాద నిర్మూలనపై రెండుదేశాల మధ్య ఎన్‌ఎస్‌ఏల స్థాయిసో చర్చలు జరుపాలని నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత చర్చలపై పాక్  ఏరోజూ చిత్తశుద్ధిని ప్రదర్శించలేదను. సరిహదుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు, భారత భూభాగంలోకి టెర్రరిస్టులను పంపుతూ ఇండియా సహనాన్ని పరీక్షిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  India  Kashmir  Separatists  Kashmir Issue  India on Kashmir Issue  

Other Articles