కొందరికి పెంపుడు జంతువులంటే ప్రాణం. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ ప్రాణాలకు మిన్నగా పెంచుకుంటారు. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా అస్సలు తట్టుకోలేరు. దాని కోసం విలవిలలాడిపోతారు. అమెరికాలోని ఓ జంటకు కూడా ఆ పిల్లి అంటే కన్న కొడుకుతో సమానం. ఎంతో మురిపెంగా చూసుకునే ఆ పిల్లికి అనారోగ్యం వచ్చింది. దీంతో వారు చాలా బాధపడ్డారు. మూత్రపిండాల వైఫల్యంతో చావుకు చేరువైన పిల్లిని కాపాడుకునేందుకు వారు చాలా రిస్కే తీసుకున్నారు. ఏకంగా 19లక్షలు ఖర్చు చేసి దానికి ఆపరేషన్ చేయించారు. మళ్లీ తమ బిడ్డను కాపాడుకున్నారు.
అమెరికాలోని బఫెలో సిటీకి చెందిన ఆండ్రీ గాన్సియర్ దంపతులు ఆ పిల్లికి శస్త్రచికిత్స చేయించారు. కొన్నేళ్ల క్రితం వారికి ఈ పిల్లి దొరికింది. దానికి ఒకీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కావడంతో ఆపరేషన్ చేయించారు. ఇందుకోసం వారు మరో పిల్లిని దత్తత తీసుకుని దాని నుంచి ఒక కిడ్నీని తీసి ఒకీకి అమర్చారు. పెన్విల్వేనియా వర్సిటీ వెటర్నరీ ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్సకు రూ.10లక్షలు, మిగతా వాటికి 9లక్షలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం ఆ రెండు పిల్లులూ కోలుకుంటున్నాయని యజమాని తెలిపాడు. డబ్బు పోతే పోయింది మా బిడ్డ బాగయ్యాడు..అది చాలు అంటున్నారు గాన్సియర్ దంపతులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more