AP | Chandrababu naidu | Liquior | income | Treasury

Ap cm chandrababu naidu very disappointed for liquior users

AP, Cm, Chandrababu naidu, Liquior, income, Treasury

AP CM Chandrababu naidu very disappointed for liquior users. Chandrababu review the liquior income with higher officials. He order to sell more liquior in the state of ap.

వాళ్లు తాగడంలేదని బాధపడుతున్న చంద్రబాబు

Posted: 08/21/2015 10:44 AM IST
Ap cm chandrababu naidu very disappointed for liquior users

అవును మీరు చదివింది అక్షరాల నిజం. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తాగడం లేదని తెగ బాధపడుతున్నారు. ఏపిలో ఉంటున్న వాళ్లు తాగడం లేదని.. అసలు ఎందుకు తాగడం లేదని ఆరా తీస్తున్నారు. మొత్తానికి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. జనాలు ఎందుకు తాగడం లేదు.. ఏమైనా కారణాలు ఉన్నాయా..? ఇంకా ఎక్కవ ఎలా తాగించాలా అన్న ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఏం తాగడం గురించి అనుకుంటున్నారొ క్లారిటీ ఇవ్వలేదు కదూ. ఆల్కహాల్ అదేనండి మందు తాగడం లేదని చంద్రబాబు నాయుడు నానా బాధలు పడుతున్నారట. అసలు జనాలు ఎందుకు అంతలా తాగడం లేదని అధికారులతో సమీక్షాసమావేశం కూడా నిర్వహించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవును మరి చంద్రబాబు నాయుడు గారికి మందు బాబుల గురించి ఎందుకు అంత ప్రేమ పుట్టుకువచ్చిందో తెలుసా..? తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.

ఏపిలొ గతంలో కన్నా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాల సంఖ్య పెరిగింది. గతంలో కన్నా కూడా రాష్ట్రానికి ఆదాయం కూడా భారీగా పెరిగింది. గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తే.. దానికి చంద్రబాబు నాయుడు నీళ్లొదిలి.. మద్యాన్ని ఏరుల్లాలా పారిస్తున్నారు. అయితే అసలే లోటు బడ్జెట్ తో బాధపడుతున్న ఏపికి ఉన్న ఆదాయంలో ఎక్కువ శాతం ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే వస్తోంది. అయితే తాజాగా గత కొంత కాలంగా మద్యం అమ్మకాలు తగ్గాయట. మందు బాబులు ఎందుకు మందు ఎక్కువగా తీసుకోవడం లేదని బాబు గారు ఆరా తీశారట. మద్యం అమ్మకాలను మరింత పెంచాల్సిందిగా అధికారులకు చంద్రబాబు సూచించారట. మొత్తానికి చంద్రబాబు నాయుడు తాగుబోతుల పాలిట దైవంగా మారారు అంటూ కొంత మంది పెదవి విరుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Cm  Chandrababu naidu  Liquior  income  Treasury  

Other Articles