delhi | rape | Hyderabad | Rape on lady

Now delhi is officially rape capital of india

delhi, rape, Hyderabad, Rape on lady, Mumbai, Rape city

Now delhi is officially rape capital of India. For the first time in history, Delhi is officially the “rape capital” of India. Even while the pace of increase in the number of reported rapes in the city has slowed down, the number of such cases proportionate to its women population was higher than for any other city or State last year

అక్కడ ఆడవాళ్లను చేస్తారు.. రేప్... రేప్.. రేప్

Posted: 08/19/2015 01:13 PM IST
Now delhi is officially rape capital of india

ఆడవాళ్లను రేప్ చేస్తారు అని ఒక్క లైన్ లో చెప్పొచ్చు కదా అని అనుకోకండి. ఇక్కడ మ్యాటర్ కాస్త వెయిట్ ఉన్నది అందుకే నొక్కివక్కానించడానికి అలా రేప్ రేప్ రేప్ అని రాయాల్సి వచ్చింది. సరే ఇక అసలు విషయానికి వస్తే  దేశంలో రేప్ చేసే సంస్రృతి అంతకంతకు పెరిగిపోతోంది. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వాళ్ల మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు.ఆడవాళ్ల మీద అ్యతాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అంటూ మీడియాలో ఎన్ని కథనాలు వస్తున్నా.. స్వచ్ఛంద సంస్థలు ఎంతలా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎలాంటి ప్రయోజనం మాత్రం కలగడం లేదు. ఇక భారత్ లో జరుగుతున్న రేప్ లలో ఎక్కువగా ఢిల్లీలోనే చోటుచేసుకుంటున్నాయి. ఢిల్లీ అంటేనే రేప్ లకు రాజధాని అన్నంతలా మారిపోయింది. గతంతో పోలిస్తే రేప్ ల నెంబర్ పెరగడంతో పాటు టాప్ ప్లేస్ ను ఢిల్లీ కంటిన్యు చేస్తోంది.

2013, 2014 భారత్ లో జరిగిన రేప్ ల లెక్కలు చూస్తే నిజంగా సిగ్గుగా అనిపిస్తుంది. బారతదేశంలో ఆడవాళ్లను దేవతలుగా పూజించే సంస్రృతి ఉన్నా కానీ వారి మీద లైంగిక దాడులు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. 2013లో ఢిల్లీలో 1441 రేప్ కేసులు నమోదు కాగా, 2014లో మాత్రం 1813 కేసులు నమోదు కావడం విశేషం. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా రేప్ ఘటనలు పెరిగాయి. 2013లో 391 చోటుచేసుకోగా 2014లో మాత్రం 607 నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తాలలో కూడా రేప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా 2013లో 33వేల 707 కేసులు నమోదు కాగా 2014లో మాత్రం 36 వేల 735 కేసులు నమోదు కావడం విశేషం. దేశంలో ఆడవాళ్ల జనాభా ఎలాగైతే పెరుగుతోందో.. అలాగే రేప్ ఘటనల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  rape  Hyderabad  Rape on lady  Mumbai  Rape city  

Other Articles