PM Modi leaves for UAE on two-day visit

Pm modi arrives in uae today says gulf region vital for india

UAE,Narendra modi,United Arab Emirates , PM Modi leaves for UAE on two-day visit,news, India news,Current Affairs News,Current Affairs News in India ,New Delhi, telugu news

During his visit first by an Indian PM in 34 years, Modi will seek to enhance cooperation in energy and trade

రెండు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోడీ

Posted: 08/16/2015 01:23 PM IST
Pm modi arrives in uae today says gulf region vital for india

యూఏఈ పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ బయలు దేరి వెళ్లారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన యూఏఈ పర్యటన కోసం ఇవాళ ఉదయం బయలుదేరి వెళ్లారు. ముందుగా అబుధాబి చేరుకోనున్న మోడీ..రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ నాయకులతో చర్చలు జరపడంతోపాటు పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. 34 ఏళ్ల విరామం తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈ అరబ్బు దేశంలో పర్యటిస్తున్నందున రెండు దేశాలు మోదీ సందర్శనకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నాయి.

ఇంధన, వాణిజ్య రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మోదీ ఈ పర్యటనను వినియోగించనున్నారు. యూఏఈ యువరాజు షేఖ్‌ మహ్మద్‌ బిన్‌ జయిద్‌ అల్‌ నహ్‌యన్‌తో ప్రధాని మోదీ సోమవారం భేటీ కానున్నారు. ఇరువురు పలు అంశాలపై ధ్వైపాక్షిక్ష్ చర్చలు నిర్వహిచనున్నారు. అక్కడి నుంచి ప్రధాని దుబాయ్‌ చేరుకోనున్నారు. దుబాయ్‌లో ఆయన యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేఖ్‌ మహమ్మద్‌ బీన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌తో భేటీ అవుతారు.

ప్రపంచంలో అతి ఎత్తైయన భవనం ‘బుర్జ్‌ ఖలీఫా’ను సందర్శించనున్నారు. దుబాయ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారత ప్రవాసులనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఎలాంటి ఉద్గారాలు వెలువడని, పర్యావరణ అనుకూల....మస్దర్‌ సిటీని కూడా మోదీ సందర్శించనున్నారు. త్వరలో జరిగే బీహార్‌, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైనార్టీ వర్గాల ఆకర్షణతో పాటు అరబ్ దేశాలలో వున్న కేరళావాసులను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మోడీ పర్యటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister  Narendra modi  UAE Tour  foreign Tour  

Other Articles