Chiranjeevi Says That They Will Fight For Munikoti Wish Ap Special Status | Raghuveera Reddy

Chiranjeevi munikoti suicide ap special status controversy chennai media

chiranjeevi, munikoti suicide, raghuveera reddy, congress meetings, ap special status, chandrababu naidu, amaravathi, ap capital city, congress worker munikoti, chiranjeevi latest news, chiranjeevi press meet

Chiranjeevi Munikoti Suicide AP Special Status Controversy Chennai Media : After reached chennai Chiranjeevi Says That They Will Fight For Munikoti Wish Ap Special Status.

‘మునికోటి ఆశయ సాధన కోసం పోరాడతాం’

Posted: 08/10/2015 12:52 PM IST
Chiranjeevi munikoti suicide ap special status controversy chennai media

ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ కార్యకర్త మునికామకోటి తనను తాను నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం విదితమే! ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభలో నేతలు మాట్లాడుతుండగానే మునికోటి ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ఈ ఉదంతాన్ని  గమనించిన స్థానికులు వెంటనే మంటలార్పి, అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైలోకి కెఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. 90 శాతం శరీరం కాలిపోవడంతో అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

అయితే.. ఈ ఉదంతం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు తమ సభను కొనసాగించడంతో ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక వ్యక్తి తననితాను నిప్పంటించుకుంటుంటే అతడిని కాపాడాల్సిందిపోయి తమ రాజకీయ స్వలాభాలకోసం సభను కంటిన్యూ చేశారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఆ సభకు హాజరైన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముగిసిన వెంటనే అక్కడినుంచి చిరంజీవి వెళ్లిపోవడంతో స్థానికులు మరింత ఊగిపోయారు. ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన చిరు.. మునికోటి అంత్యక్రియల విషయమై దగ్గరుండి చూసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన, రఘువీరా రెడ్డి  మునికోటి మృతదేహాన్ని తిరుపతికి తీసుకొచ్చేందుకు చెన్నైకి బయలుదేరారు.

చెన్నైకి చేరుకున్న అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. మునికోటి ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి ఆశయ సాధన కోసం పోరాడతామని ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు మునికోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ap Special Status  Raghuveera Reddy  

Other Articles