Kodandaram Planning To Make JAP Party With Former AAP Leader Yogendra Yadav | Political Gossips

Kodandaram yogendra yadav jap party political gossips

Kodandaram news, JAP party, Kodandaram updates, Kodandaram gossips, JAP party gossips, joint action party, aap party news

Kodandaram Yogendra Yadav JAP Party Political Gossips : Kodandaram Planning To Make JAP Party With Former AAP Leader Yogendra Yadav.

‘ఆప్’ పార్టీకి కాపీ పేస్టుగా ‘జాప్’

Posted: 08/07/2015 11:22 AM IST
Kodandaram yogendra yadav jap party political gossips

ఆప్.. ఆమ్ ఆద్మీ పార్టీ! 127 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ ను ఏకిపారేసిన అధికార బేజీపిని దేశరాజధానిలో ముచ్చెమటలు పట్టిస్తున్న ఓ సామాన్యుడి పార్టీ. అంతేకాదు.. దేశ ప్రజల్లో ఎలా మమేకమవ్వాలోనన్న విధానాలను ఆ పార్టీ ప్రతిఒక్కరికి తెలియజేసింది. మాయమాటలు చెప్పడం కాదు.. నిజాల్ని నిగ్గుతేల్చి బహిర్గతం చేసే దమ్ముండాలని నిరూపించింది. దాంతో ఆ పార్టీ విధానాలకు ఆకర్షితులైన ప్రజలు.. దానిని ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ పార్టీ తరహాలోనే ప్రజల్ని తమవైపుకు ఆకర్షించేందుకు ‘జాప్’ వస్తోంది. ఈ పార్టీని స్థాపిస్తోంది మరెవ్వరో కాదు.. తెలంగాణలో జేఏసీ నేత కోదండరాం! అవును.. ఈయన ఆధ్వర్యంలో ఈ కొత్త పార్టీ వేళ్లూనుకోనుందని రాజకీయ విశ్లేషకుల సమాచారం.

ఢిల్లీలోని ‘ఆప్’ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో జాయింట్ యాక్షన్ పార్టీ (జాప్) పేరిట ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసి, సంపూర్ణ తెలంగాణ కోసం కృషి చేయాలని కోదండరాం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆప్ పార్టీ నుంచి బయటికి వెలివేయబడ్డ యోగేంద్ర యాదవ్ ఆమధ్య తాను ఒక కొత్త పార్టీని పెట్టనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే! ఈయన నేతృత్వంలో ఇప్పుడు ఓ కొత్త పార్టీ ఆవిర్భావం కానుందని, ఆయన కోదండరాంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరి మధ్య ఈనెల 10వ తేదీన కీలక సమావేశం జరగనుందని వార్తలొస్తున్నాయి. ఆ సమావేశం తరువాతే కొత్త పార్టీపై మరిన్ని విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరి.. ఈ వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం వుందో తెలియాలంటే.. 10వ తేదీ వరకు ఆగాల్సిందే!

ఇదిలావుండగా.. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ‘ఆప్’కు కన్వీనర్ గా వుండాలని కోదండరాంకి యోగేంద్ర ఆఫర్ ఇవ్వగా.. దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే! కానీ.. ఇటీవల ఓ సందర్భంలో కోదండరాం మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ప్రొఫెసర్ గా వున్నాను.. రేపు ఏమవుతానో చెప్పలేను.. ‘సంపూర్ణ తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, యోగేంద్రతో కలిసి ‘జాప్’ పార్టీలో భాగస్వామ్యం పంచుకునే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodandaram  yogendra yadav  jap party  aap  

Other Articles