DCW chief Swati Maliwal equates prostitution with rape

Swati maliwal equates prostitution with rape calls it a blot

DCW chief Swati Maliwal equates prostitution with rape, swati maliwal,DCW,Delhi Commission for Women,rape,Swati Maliwal on rape,DCW chief equates prostitution with rape,Delhi,Delhi Government,Delhi AAP government, Women, Swati Maliwal, Delhi Commission for Women, DCW

The Delhi Commission for Women (DCW) chairperson Swati Maliwal today deprecated society's attitude to prostitution, which she said supports "rape" of sex workers.

వ్యభిచారం.. కూడా అత్యాచారమే: స్వాతి

Posted: 08/05/2015 01:43 PM IST
Swati maliwal equates prostitution with rape calls it a blot

వ్యభిచారం కూడా అత్యాచారంగానే పరిగణించాలని ఢిల్లీ మహిళ కమీషన్ చైర్మన్ స్వాతి మలివాల్ అన్నారు. అత్యాచారం చేయడాన్ని పెద్దగా చూస్తూన్న.. సమాజం. వ్యభిచారన్ని మాత్రం ఆ తీరుతో చూడటం లేదని.. ఇది కూడా సెక్స్ వర్కర్లపై జరుగుతున్న అత్యాచారంగానే పరిగణించాలని అమె అన్నారు. వ్యభిచారాన్ని కూడా సహించరాని నేరంగానే పరిగణించాలన్నారు. వ్యభిచార కూడా సమాజంపై పడిన ఒక మరక అని అమె వ్యాఖ్యానించారు. వ్యభిచారం శృతిమించి.. డబ్బులు పెట్టి అటుగా వెళ్లలేని వాళ్లే అమాయక అమ్మాయిలపై అత్యాచారాలకు తెగబడే అవకాశాలున్నాయని అమె అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలోని జీబి రోడ్ లో వున్న రెడ్ లైట్ ఏరియాలో జరుగుతున్న తంతును అత్యాచారంతో పోల్చిన అమె ప్రభుత్వాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెడ్ లైట్ ఏరియాలో నెలకు ఆరు లక్షల కండోమ్ లను తాము పంపిణీ చేస్తన్నామని, అంటే ప్రభుత్వం నెలకు ఆరు లక్షఃల అత్యాచారాలకు అధికారిక అనుమతి ఇస్తునట్టే కదా అని అమె ప్రశ్నించారు. సెక్స వర్కర్లపై వ్యభిచారం పేరుతో జరుగుతున్న తంతును అత్యాచారాలుగా ఎందుకు పరిగణించలేమాని అమె ప్రశ్నించారు. ఇక వెలుగులోని రాని మైనర్ సెక్స్ వర్కర్ల సంఖ్యను కూడా జతకలిపితే అత్యాచారాల సంఖ్య మరింత ఎక్కువగా వుండే అవకాశాలున్నాయి అమె అన్నారు

వ్యభిచారాన్ని ప్రజలు సైతం అమోదించడం ఘోరమని అమె అన్నారు. జీబీ రోడ్డులోని రెడ్ లైట్ ఏరియాపై తాను ఎంతో మందితో మాట్లాడానని, రెడ్ లైట్ ఏరియాను మూసేస్తే అత్యాచారాల సంస్య పెరుగుతుందని ప్రజలు అభిప్రాయపడటం కూడా విచిత్రంగా వుందన్నారు. ఈ విధమైన మైండ్ సెట్ ఉండటం దురదృష్టకరం అన్న అమె.. ప్రజల మైండ్ సెట్ మారేంత వరకు మార్పు రాదని అన్నారు. వ్యభిచారం, అత్యాచారం రెండు వేర్వేరు అన్న అభిప్రాయం నుంచి ప్రజలు తేరుకోవాలన్ని స్వాతి మాలివాల్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women  Swati Maliwal  Delhi Commission for Women  DCW  

Other Articles