Devineni Nahru | Govt Employees |

Devineni nahru fire on govt employees

Devineni Nahru, Govt Employees, APPCC, Congress, NGOs, Rajyasabha seat

Devineni Nahru fire on Govt employees. He said to govt employees that are u govt employee or brokers...?

ఉద్యోగులా.. బ్రోకర్లా అంటూ దేవినేని నెహ్రూ ఆగ్రహం

Posted: 08/05/2015 08:27 AM IST
Devineni nahru fire on govt employees

ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ప్రభుత్వ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులా లేక ప్రభుత్వానికి బ్రోకర్లా అని దేవినేని నెహ్రూ ప్రశ్నించారు. కొందరు ఉద్యోగ సంఘం నాయకులు అధికారంలో ఉన్న పార్టీలకు దాసోహం అంటున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సీట్ల కోసం ఉద్యోగ సంఘం నాయకులు బ్రోకర్లుగా మారిపోయారని మండిపడ్డారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హాదా విషయంలో బీజేపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని దేవినేని నెహ్రూ మండిపడ్డారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన మాటను తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే స్వయంగా ఒప్పుకున్నారని నెహ్రూ గుర్తు చేశారు. అవినీతిని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీలను బహిష్కరించడం ప్రధాని మోడీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారాయన. ఏపీకి ప్రత్యేక హాదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్న దేవినేని.. నిస్వార్థంతో ఏపీ ప్రత్యేక హాదా కోసం పోరాటం చేసే ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devineni Nahru  Govt Employees  APPCC  Congress  NGOs  Rajyasabha seat  

Other Articles