Delhi Police Filed Case Against Aamir Khan For Using Thulla Word In PK movie | Arvind Kejriwal

Delhi police filed case against aamir khan thulla dialogue pk movie

aamir khan, pk movie, pk movie controversy, pk updates, pk movie collections, pk movie news, pk controversies, thulla word, thulla controversy, bollywood news, aamir khan pk news, aamir khan thulla word, arvind kejriwal, arvind kejriwal controversy

Delhi Police Filed Case Against Aamir Khan Thulla Dialogue PK movie : A filmmaker has filed a complaint against Bollywood Bollywood superstar Aamir Khan for referring to Delhi's policemen with the derogatory slang term "thulla" in his 2014 blockbuster 'PK'.

‘పీకే’తో వేగలేకపోతున్న అమీర్.. మరో కొత్త కేసు!

Posted: 08/03/2015 03:32 PM IST
Delhi police filed case against aamir khan thulla dialogue pk movie

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘పీకే’ చిత్రం సరికొత్త రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇదివరకు ఏ సినిమా రాబట్టని భారీ వసూళ్లను కొల్లగొట్టేసింది. అంతెందుకు..  చివరికి చైనాలోనూ విడుదలై ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మనన్నలు పొందింది. ఈ విధంగా భారీ స్థాయిలో విజయకేతనం ఎగరవేసిన ఈ చిత్రం... మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటూ వచ్చింది. ఆ వివాదాలు ఎలాగోలా సమసిపోయాయిగానీ.. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ అసభ్యకరమైన వ్యాఖ్య వుందని అమీర్ ఖాన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పోలీసులను ఉద్దేశించి ‘తుల్లా’ అనే పదాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే! ఇప్పటికీ ఇదే విషయమై ఢిల్లీలో రచ్చ కొనసాగుతోంది. ఇదే ‘తుల్లా’ పదాన్ని ‘పీకే’ సినిమాలో కూడా అమీర్ ఖాన్ పోలీసులను ఉద్దేశించి ఉపయోగించాడని ఆరోపిస్తూ.. ఉల్లాన్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పదాన్ని ఉపయోగించినందుకు సీఎం స్థాయిలో వున్న కేజ్రీవాల్ పైనే కేసు నమోదైనప్పుడు, అమీర్ ఖాన్ పై కూడా నమోదు చేయాల్సిందేనని అతగాడు కోరాడు. ఆదారాల కోసం ‘పీకే’ సినిమా డివిడిలను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో, అమీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి.. దీనిపై అమీర్ ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  arvind kejriwal  pk movie  thulla controversy  

Other Articles