ఆ ఆస్ట్రేలియన్ సర్పర్ కి ఇంకా భూమ్మిద నూకలు బాకీ వున్నాయి. అతనిపై శివుడి అజ్ఞ లేకపోవడం అందుకే అతను చావు చేంతకు వెళ్లినా.. తనకు తెలిసిన విద్యతో తప్పించుకుని రాగలిగాడు. అదెలా అంటారా..? తన చేతి పంచుల ద్వారా..? నమ్మశక్యంగా లేదా..? షార్క్ లాంటి అతిపెద్ద జంతువు మనిషి పంఛ్ పవర్ తో వెనుదిరింగిందంటే నమ్మశక్యంగా లేదు కదూ..? కానీ ఇదే నిజం. అస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ లో అ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన క్రెయిగ్ ఐసన్ పరిస్థితి మాత్రం విషమంగానే వున్నా నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
ఇవాళ ఉదయం ఐసన్ సహా మరో వ్యక్తి 100 మీటర్ల సర్పింగ్ చేస్తుండగా.. అనుకోకుండా వారికి ఓ షార్ప్ కనిపించింది. అంతే వారు దాని చూసిన షాక్ నుంచి తేరుకోకముందే అది వారిపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఐసన్ తో వచ్చిన వ్యక్తి తప్పించుకోగా, ఐసన్ మాత్రం దానికి చిక్కాడు. అయితే తాను చేస్తున్న సర్పింగ్ క్రీడ కన్నా ముందు తాను బాక్సింగ్ లో నిష్ణాతుడు. సరిగ్గా అ క్రీడను గుర్తు తెచ్చుకున్న ఐసన్.. షార్క్ నుంచి తప్పించుకునే క్రమంలో దానిపై పంచుల వర్షం కురిపించాడు. అప్పటికీ షార్క్ తన తోకతో ఐసన్ శతవిధాలా గాయపర్చేందుకు యత్నించింది. దానిపైనా కూడా ఐసన్ తన పిడిగుద్దులు కరిపించి.. ఎలాగోలా తప్పించుకోగా సముద్ర తీరంలో వున్నవారు అయన పరిస్థితిని గమనించి వెంటనే అసుపత్రికి తరలించేందారు.
ఈ ప్రయత్నంలో ఐసన్ చేతికి, కాలికీ గాయాలలయ్యాయని అధికారులు వివరించారు. సర్జరీ చేయాల్సి అవసరం వుందని వైద్యులు తెలిపారు. ఈ నెలలో ష్కార్ దాడి జరగడం ఇది మూడోవసారి అని, ఈ ఘటన తర్వాత 24 గంటల పాటు చుట్టుపక్కల వున్న అన్ని బీచ్ లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అస్ట్రేలియా సర్పింగ్ ఛాంపియన్ మిక్ పాన్నింగ్ దక్షిణాప్రికాలోని ఓ బీచ్ లో తనపై దాడికి యత్నించిన షార్క్ పై పంచుల పవన్ చూపించిన వారంలోనే అస్ట్రేలియా మరో సర్పర్ షార్క్ బారిన పడి అదే పద్దతిలో భయటపడటం గమనార్హం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more