ISIS terrorists ripped off by girls who conned them out of 'travel money' to Syria

Catfished chechen girls troll isis with fake bride scam

Chechen Girls Troll ISIS With Fake Bride Scam, Caucasus, jihadis fishing for mail-order brides, ISIS bride, young Chechen women, Russian mail-order bride, world, Chechnya, Russia, Russia, Syria, ISIS, ISIS Islamic State of Iraq and the Sham, ISIS terrorists, ripped off, chechen girls, 'travel money' to Syria, Fake Bride Scam

A trio of young Muslim women have been conning ISIS by setting up fake social media accounts and getting the terror group to send them money to travel to Syria to become jihadi brides, according to police.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకే టోకరా ఇచ్చిన ‘కిలాడీ లేడీలు’

Posted: 07/31/2015 07:35 PM IST
Catfished chechen girls troll isis with fake bride scam

ప్రపంచం మొత్తాన్నీ దడదడలాడిస్తున్న అత్యంత సంపన్నమై ఉగ్రవాద సంస్థ అది. తమ ఉగ్రవాద సంస్థలోకి అనేక మందిని అహ్వానిస్తూ.. నిత్యం ప్రపంచాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. అయితే ఈ ముగ్గురు అమ్మాయిల మాత్రం ఆ భయంకర ఉగ్రవాదులకే టోకరా ఇచ్చారు. నమ్మశక్యంగా లేదా..? నిజమండీ.. రష్యాలోని చెచెన్యాకు చెందిన యువతులు. నరరూప రాక్షసుల వంటి వారితోనే పెట్టుకుని వారికి దిమ్మదిరిగే స్ట్రోక్ ఇచ్చారు. యువతుల్చిన స్ట్రోక్ తో ఇసెస్ ఉగ్రవాదుల మైండ్ బ్లాక్ అయ్యిందంటే నమ్మండి.

ఇంతకీ వారేం చేశారు..? తెలుసుకోవాలని వుందా. అయితే వివరాల్లోకి వెళ్దాం.. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ చాలా మంది యువకులను, యువతులను ఆకర్షించి వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అయితే ఇదంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంటుంది. ఎక్కువగా వారు ముస్లిం ప్రాంతమైన చెచెన్యా యువతీయువకులను తీసుకునేందుకే మొగ్గు చూపుతారు. అదే క్రమంలో గురువారం ముగ్గురు యువతులు.. తాము ఐఎస్ సంస్థలో చేరుతామని అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి ఐఎస్ ఆన్‌లైన్ రిక్రూటర్స్ అంగీకరించారు.

అయితే తమకు సిరియా వచ్చేందుకు అవసరమైన డబ్బులు లేవని, మీరు ఆ డబ్బు సర్దుబాటు చేస్తే వెంటనే వచ్చేస్తామని చెప్పారు. డబ్బు జమ చేయవలసిందిగా ఓ నకిలీ అకౌంట్‌ నెంబర్ కూడా ఇచ్చారు. వెంటనే ఐఎస్ ప్రతినిధులు ఆ ఆకౌంట్‌లో 3,300 డాలర్లు (రూ.2,14,500/-) డిపాజిట్ చేశారు. ఆ డబ్బు తీసుకున్న ఆ యువతులు వెంటనే ఆ అకౌంట్‌ను డిలీట్ చేయడంతో పాటు సోషల్ వెబ్ సైట్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో రాయభారం నడిపిన అకౌంట్లను కూడా డిలీట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చెచెన్యా పోలీసులు వారి కోసం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి భయానకమైన చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS terrorists  ripped off  chechen girls  'travel money' to Syria  Fake Bride Scam  

Other Articles