Yakub Memon to be hanged on Thursday, says SC, Maharashtra Guv rejects mercy plea

No procedural lapse in deciding yakub memon s curative petition sc

Supreme Court refers Yakub Memon's plea to larger bench, 1993 mumbai blasts, curative petition, death penalty, supreme court, 1993 Mumbai serial blasts convict Yakub Memon, Yakub Memon, salman khan on memon, Yakub Memon's plea against his death sentence, 30 july Yakub Memon death sentence, Nagpur jail, deah sentence, death sentence to yakub memon, death penalty to yakub memon, Dawood Ibrahim, Mumbai Serail Blast Case, Supreme Court, TADA court, Tiger Memon, Yakub Memon

After the rejection of mercy petition by the President, Memon had not challenged that in the court of law, says the SC. SC does not find fault with the issuance of death warrant by TADA court.

యాకూబ్ మెమెన్ క్షమాబిక్ష పిటీషన్. తిరస్కరణ.. రేపే ఉరి

Posted: 07/29/2015 04:01 PM IST
No procedural lapse in deciding yakub memon s curative petition sc

1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్‌ మెమెన్‌ క్షమాబిక్ష పిటీషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెమెన్‌ దాఖలు చేసిన క్యూరేటివ్ (క్షమాభిక్ష) పిటీషన్ పై విచారణ సక్రమంగానే సాగిందని అభిప్రయాపడిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని పేర్కోంది. ఈ పిటీషన్ పై మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. యాకుబ్ మెమెన్ క్యూరేటివ్ పిటిషన్‌ను రెండోసారి విచారించే ప్రశ్నే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఎలాంటి లోపాలు లేవు అని పేర్కొంది.

ఇది ఇలా ఉండగా తనకు క్షమాబిక్షను పెట్టాలని మరోమారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి యాకూబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తిరస్కరించారు. తనకు క్షమాబిక్ష ప్రసాదించాలని, మరణ శిక్షను జీవితఖైదుగా మర్చాలని ఆయన పెట్టుకున్న పిటీషన్లు రెండు తిరస్కరించబడ్డాయి. దీంతో మెమెన్ కు ఉరిశిక్ష అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ముంబై వరుస పేలుళ్ల కేసును విచారించిన నాగ్ పూర్ టాడా కోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో రేపు నాగ్ పూర్ జైలులో ఉదయం ఏడు గంటలకు మెమెన్ కు ఉరిశిక్ష అమలుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ పూర్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 1993 mumbai blasts  yakub memon  death penalty  supreme court  

Other Articles