TDP Mahila MLA File Case on her Husband

Mla anitha complaints on her husband

TDP Mahila MLA File Case on her Husband, mla anitha complaints on her husband, mla vangalapudi anitha, complaint, husband, shivaiah, visakha, payakaraopeta, TDP, Payakrao Peta MLA, Vangalapudi Anitha

DP Mahila Payakrao Peta MLA Vangalapudi Anitha File a case on her husband due to Threatened on her Childrens and assets issue

చాలు.. ఇక చాలు.. భరించే ఓపిక నాకు లేదు..

Posted: 07/18/2015 06:21 PM IST
Mla anitha complaints on her husband

ప్రజలకు భరోసాగా వుండాల్సిన ప్రజాప్రతినిధే ప్రస్తుతం పోలిస్ స్టేషన్ కు వచ్చి తన భర్తపై కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన భర్త శివయ్యపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తను ఇంట్లో లేనప్పుడు వచ్చి పిల్లలపై దౌర్జన్యం చేశాడని, గన్‌మెన్, పీఏలను బెదిరించాడని ఫోన్ ద్వారా పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమె భర్త శివయ్యను అరెస్టు చేశారు. ఇప్పటికే వారిద్దరి మధ్య చోటు చేసుకున్న విభేదాలతో నమోదైన కేసు కోర్టు పరిధిలో వుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శివయ్య వేధింపులను 14 ఏళ్లు భరించాను.. సహనం నశించింది. ఇంకా భరించలేను’’ అని ఎమ్మెల్యే అనిత వాపోయారు. కాగా 14 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అనిత, శివయ్య ఇదే పోలీస్‌స్టేష్‌న్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరువురి మధ్య మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల నుంచి విడివిడిగా జీవనం ఉంటున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే అనిత, శివయ్యకు విడాకుల నోటీసులు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివయ్య, ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బలవంతంగా పిల్లలను, ఆస్థి పత్రాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివయ్యను అడ్డుకున్న ఎమ్మెల్యే పీఎ, గన్‌మెన్‌లపై తిరగబడ్డాడు. దీంతో అనిత పోలీసులను ఆశ్రియించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla vangalapudi anitha  complaint  husband  shivaiah  visakha  payakraopeta  

Other Articles