CCTV Footage: Delhi Police Sub Inspector Rapes Woman At Gunpoint

Delhi police asi allegedly raped woman on gunpoint

Delhi Police ASI Allegedly Raped Woman On Gunpoint, Rape, Delhi, Police, ASI, Assistant Sub-Inspector, Delhi Police, 14-days custody, rape case, rape cases against woman in India, rape cases against woman, alcoholic condition, rape, violence against women, crime against women, harrassment against women

Delhi Police ASI Jaiveer has allegedly raped a woman on gunpoint in Punjabi bagh, the whole incident was recorded in a CCTV camera.

ITEMVIDEOS: కామాంద ఖాకీకి కటకటాలు.. సిసిటీవీకి చిక్కిన అత్యాచారంపర్వం..

Posted: 07/11/2015 09:05 PM IST
Delhi police asi allegedly raped woman on gunpoint

దేశరాజధాని ఢిల్లీలో పోలీసుల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమౌవుతున్నా.. అక్కడి పోలీసుల తీరులో మార్పు మాత్రం కానరావడం లేదు. ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు నానాటికి శృతిమించిపోతున్నా.. వాటిని అరికట్టాల్సిన పోలీసులు విఫలమవుతున్నారు. పైగా వారే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. నేరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన రివాల్వర్ తో కూతురి వయస్సున యువతిపై ఓ యాభై ఏళ్ల ఏఎస్ఐ అత్యాచారానికి పాల్పడటం ఢిల్లీలో కలకలం రేపుతోంది. పశ్చిమ ఢిల్లీలోని పంజాబి బాఘ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి తన స్నేహితుడి ఇంట్లో పని చేస్తున్న ఓ యువతి(23) తలపై పాయింట్ బ్లాంక్‌లో రివాల్వర్ పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాళ్లోకెళితే.. పంజాబి బాఘ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ జవీర్ సింగ్ గురువారం రాత్రి రాణీ బాఘ్ ప్రాంతంలోని అతని స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో చిత్తుగా తాగాడు. మద్యం మత్తులో ఆ ఇంట్లో పనిచేస్తున్న యువతిపై అత్యచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ యువతి ప్రతిఘటించడంతో జవీద్ తన గన్ తీసి యువతి పాయింట్ బ్లాంక్‌లో పెట్టి బెదిరించాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనంతా ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. మరుసటి రోజు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఏఎస్ఐ జవీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Police  Jaiveer  CCTV  

Other Articles