social media | britian | ban | whatsapp | smart phones

Social media specially whatsapp will ban in britian soon

social media, britian, ban, whatsapp, smart phones

Social media specially whatsapp will ban in britian soon. Britons could see the hugely popular cross-platform app BANNED under strict new laws on social media and online messaging services.

అక్కడ సోషల్ మీడియా బంద్ ఎందుకంటే..

Posted: 07/11/2015 03:59 PM IST
Social media specially whatsapp will ban in britian soon

ఇప్పుడు అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయ్..  దాదాపు అందరి స్మార్ట్ ఫోన్ లలో వాట్సప్‌ ఉంటుంది. నెట్ బ్యాలెన్స్‌ కూడా ఉంటుంది. అయినా మెసేజ్ చేస్తే మాత్రం అవతలి వాళ్లకు వెళ్లదు. అసలు వాట్సప్‌ పనిచేయకుండా మొరాయిస్తుంది... బ్రిటన్‌లో త్వరలో రాబోతున్న కఠిన చట్టాలతో వాట్సప్‌ లాంటి ఎన్నో సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.

ఈ రెండూ లేకపోతే రోజుగడవని పరిస్థితి. మొబైల్ టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు వీటిని మన లైఫ్‌లో ఓ భాగం చేసేశాయి.  పర్సనల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకూ అన్ని వాట్సప్స్ వంటి చాటింగ్ యాప్స్‌ ద్వారానే సాగుతున్నాయి. అయితే బ్రిటన్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా సోషల్ నెట్‌వర్కింగ్స్‌ ద్వారా మెసేజింగ్ భవిష్యత్తులో కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏరకమైన ఎన్‌ క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకునే విధంగా కొత్త చట్టాన్ని అమలు చేయాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ నిర్ణయించారు. అంటే ప్రజల మధ్య జరిగే ప్రతి కమ్యూనికేషన్ ప్రభుత్వానికి, పోలీసులకు కూడా అందుబాటులో ఉండాలని  కామరాన్ ప్రభుత్వం భావిస్తోంది. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా.. వాట్సప్‌ లో మెసేజ్ చేసినా.. స్నాప్ చాట్‌లో వీడియో సందేశాలు పంపుకున్నా... అవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలియాలనేది కామెరాన్ ఆలోచన.

ఆదిశగా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తోన్న బ్రిటన్ ప్రభుత్వం...మూడు ప్రముఖ సంస్థలను టార్గెట్‌గా చేసుకుంది. వాట్సప్‌, ఐమెసేజ్‌, స్నాప్‌చాట్... బ్రిటన్ చట్టాన్ని అమలోకి తెచ్చిన వెంటనే యూకేలో ఈ మూడు సంస్థల సర్వీసులు ఆగిపోతాయ్. అదే జరిగితే మాత్రం సోషల్  మెసేజింగ్‌ వ్యవస్థకే పెద్ద దెబ్బ అని చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social media  britian  ban  whatsapp  smart phones  

Other Articles