Ramcharan | trujet | Aviation | RamcharanTeja | mega Power star | Ramcharan | Airlines

Ramcharn trujet to launch operations from july 12

Ramcharan, trujet, Aviation, RamcharanTeja, mega Power star Ramcharan, Airlines

Ramcharn TruJet to launch operations from July 12 Mega Powerstar Ramcharan who proved his acting skills in Tollywood has been investing in many other fields. He has recently joined hands with Turbo Aviation for an airline company named Trujet which has received all the required licenses recently.

ఈ నెల 12నుండి రామ్ చరణ్ ట్రూజెట్ విమాన సర్వీసులు

Posted: 07/10/2015 11:39 AM IST
Ramcharn trujet to launch operations from july 12

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా వున్న నటుడు రామ్‌చరణ్ తేజ, అటు వ్యాపారవేత్తగా కూడా రాణించేందుకు కదనరంగంలోకి దిగారు. రాంచరణ్ విమానయాన రంగంలోకి దిగుతున్న విషయం పాఠకులకు  తెలిసిందే. తాజాగా ట్రూజెట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుండి డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే ఈ నెల 12 నుండి డొమెస్టిక్ సర్వీసులను ఆ తర్వాత రెగ్యులర్ సర్వీసులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి, తిరుపతి నుండి రాజమండ్రి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైజాగ్ నుండి సర్వీసులను ప్రారంభించనున్నారు.  మొత్తానికి అప్పుడు ఇప్పుడు అనుకున్న ట్రూజెట్ సర్వీసులు మొత్తానికి 12 తేదిని ప్రారంభం  కాబోతున్నాయి. ఎంతో కాలంగా అనుకుంటున్న చెర్రీ విమానాలు మొత్తానికి గాలిలో ఎగరనున్నాయి.

Also Read:  నింగిలోకి ఎగిరిన రామ్ చరణ్ ‘ట్రూజెట్’ తొలి విమానం

రామ్ చరణ్ ప్రారంభిస్తున్న ట్రూజెట్ సర్వీసులకు ఇప్పటికే లైసెన్స్ లబించింది.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రీజినల్ ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ కూడా ఇచ్చింది. రామ్ చరణ్ వంకాయలపాటి ఉమేష్ తో కలిసి ట్రూజెట్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ట్రూజెట్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న డొమెస్టిక్ సేవలను ప్రారంభిస్తామని,  26 నుండి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. కాగా రామ్ చరణ్  రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి శీను వైట్లతో ఓ సినిమా తీస్తున్నారు దసరాకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramcharan  trujet  Aviation  RamcharanTeja  mega Power star Ramcharan  Airlines  

Other Articles