Sandra | Arrest | Cash for vote | ACB | Telangana | Sandra Venkateveeriah

Suspence going on sandra venkataveriah arrest in the cash for vote case

Sandra, Arrest, Cash for vote, ACB, Telangana, Sandra Venkateveeriah

Suspence going on Sandra venkataveriah arrest in the cash for vote case. Te;angana ACB didnt conform the arrest of sandra officially.

సండ్ర అరెస్టుపై ఏసీబీ గేమ్ ప్లాన్ ..?

Posted: 07/07/2015 10:22 AM IST
Suspence going on sandra venkataveriah arrest in the cash for vote case

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో సండ్ర ఎంతో కీలకంగా వ్యవహరించారని, రేవంత్ రెడ్డి కన్నా ముందుగా సండ్ర వెంటక వీరయ్య ఓటుకు నోటు వ్యవహారంలో వధ్యవర్తిత్వం నిర్వహించారని తెలంగాణ ఏసీబీ భావిస్తోంది. అందుకే రెండు సార్లు నోటీసులు ఇచ్చి మరి విచారణకు హాజరయ్యేలా చేసింది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన సండ్ర వెంటక వీరయ్యకు సంబందించిన ఏసీబీ అధికారులు పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. కేసులో ప్రత్యక్ష ప్రమేయమున్న నేపథ్యంలోనే సండ్రను అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు వివరిస్తున్నారు. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలతో సండ్ర ఏకంగా 23 సార్లు ఫోన్ లో మాట్లాడారని వారు అంటున్నారు. ఈ విషయంలో పక్కా ఆధారాలతో సండ్రను అరెస్టు చేశామని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే నిన్న ఉదయం విచారణకు హాజరైన సండ్రను విచారించి, చివరకు రాత్రి పూట అరెస్టు చేశారు తెలంగాణ ఏసీబీ అధికారులు. అయితే సండ్ర వెంకట వీరయ్య అరెస్టును ఏసీబీ అధికారులు ధ్రృవీకరించలేదు.

Also Read:  ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర

ఇదే అనుమానాలను తావిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో సండ్రను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఎందుకు సండ్ర అరెస్టును ధ్రృవీకరించడం లేదు.? ఏసీబీ అధికారులు సండ్ర విషయంలో గేమ్ ప్లాన్ వేస్తున్నారా..? ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరెవరు కీలకంగా ఉన్నారో వారిని తీవ్ర వత్తిడికి గురి చెయ్యడమే ఏసీబీ లక్ష్యమా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నా కానీ సమాధానాలు మాత్రం లేవు. సండ్ర అరెస్టు తర్వాత ఏసీబీ అధికారులు ఎందుకు కనీసం స్పందించడం లేదు...?  సండ్ర అరెస్టు ను ఏసీబీ దృవీకరించడపోవడానికి రాజకీయ కారణాలు ఏవైనా ఉన్నాయా..? లేదా అరెస్టును ప్రకటించిన వెంటనే బెయిల్ పై బయటకు వెళతారని కావాలనే ఏసీబీ అధికారులు బావిస్తున్నారా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:  ఏసీబీ ముందుకు సండ్ర.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠ

అయితే ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అరెస్టును ఇప్పటి దాకా ఏసీబీ అధికారింకరంగా ప్రకటించలేదు. రాత్రి 11 గంటలదాకా సండ్ర వెంకట వీరయ్య అరెస్టు పై ఏసీబీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వీడుదల కాలేదని సండ్ర తరఫు లాయరు వివరించారు. సండ్ర అరెస్టును ఏసీబీ ప్రకటించిన వెంటనే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అసలు రాత్రంతా సండ్రను ఏసీబీ అధికారులు తమ అదుపులో ఎలా ఉంచుకుంటారని కూడా న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. అయితే సండ్ర అరెస్టు మీద ఏసీబీ అధికారికంగా ప్రకటించిన కొద్ది సేపటికే బెయిల్ పిటిషన్ దాఖలు చెయ్యడం.. అన్నీ కుదిరితే బయటకు తీసుకురావడానికి అన్కని ఏర్పాట్లు చేస్తున్నారు సండ్ర తరఫు లాయరు. మరి ఏం జరుగుతుందో నేడు చూడాలి.

Also Read:  ఓటుకు నోటు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర అరెస్టు

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandra  Arrest  Cash for vote  ACB  Telangana  Sandra Venkateveeriah  

Other Articles