Start Singing Bollywood Songs If You Want To Travel By Meter In Auto!

Foreigner gives shock to autowala in hyderabad

Foreigner Gives Shock to Autowala in Hyderabad, Autowala, revenge, American scholar, Christine Fair, south indian languages, south indian culture, passengers, autowala harassment, foreign guest, auto meters, auto rickshaw drivers,

Indian auto rickshaw drivers are notorious for not going by the meter and thus causing uncalled for harassment to the passengers, especially to our foreign guests.

ITEMVIDEOS: ఆటోవాలా ఆగడాలను ధాటుగా ఎదుర్కొన్న అమెరికా అమ్మాయి

Posted: 07/04/2015 05:10 PM IST
Foreigner gives shock to autowala in hyderabad

హైదరాబాదులో ఆటోవాలా అంటే నగరవాసికి ఓ రకంగా కోపం, మరో విధంగా ఇష్టం కూడా. ఆర్థరాత్రి అయినా తమను గమ్యస్థానాలకు చేర్చుతున్నాడన్న ఇష్టం వారిపై వుంటూంది. అకాల సమయంలో ఆదుకోవా.. ఆటోవాలా. అంటే.. చార్జీలు పెట్టి కొట్టేస్తుంటాడని కోపం. అయితే.. తమ రోజు వారి జీవితాలను లాగించడానికే సమయం సరిపోని నగరవాసీ.. ఇక ఆటోవాలలతో ఎందుకు గోడవ అంటూ ఎప్పటికప్పుడు సర్ధుకుని పోతుంటాడు. అత్యవసర సమయాలను పసిగట్టి ఎవరికి వారు తమ ఆపీసుల్లోనే. కార్యకాలపాల్లోనే. లేక ఇతరత్రా వ్యవహరాల్లో అందరూ అదను చూసి లాభాన్ని గడించేవారే. అయితే.. అటోవాలాల అడగాలతో విసిగి వేసారిపోయిన హైదరాబాద్ కు సుపరిచితురాలైన ఓ అమెరికా అమ్మాయి.. మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఇచ్చిన ట్రీట్ మెంట్ తో ఆటోవాలాలకు షాక్ తగిలింది. అదేంటంటారా..?

దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు, తదితర అంశాలపై పరిశోధనలు చేస్తున్న జార్జిటౌన్ యూసివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్ హైదరాబాద్ వచ్చింది. గత 15 ఏళ్ళుగా అనేకసార్లు హైదరాబాద్ కు వచ్చింది. తెలుగు, హిందీ, ఉర్ధూ భాషలు కొద్దికొద్దిగా కలగలిపి మాట్లాడగలదు. అదే విధంగా ఆమె మూడు రోజుల క్రితం మళ్ళీ హైదరాబాదుకు వచ్చింది. ఎప్పటిలాగానే చార్మినార్ వెళ్ళేందుకు ఆటోవాలాను పిలిచింది… ఆమె పిలవంగానే ఒక ఆటోవాలా ఆమె వద్దకు వెళ్ళాడు...

ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగగానే.. చార్మినార్ వెళ్ళాలి… మీటరు వెయ్యమని అడిగింది క్రిస్టీనా అందుకు ఆటోవాలా నిరాకరించాడు. అడిగినంత ఇస్తేనే వస్తానన్నాడు. ఇలా ఇద్దరి మధ్య కోద్ది సేపు వాద ప్రతివాదాలు సాగాయి. దీంతో కోపంతో ఆ ఆటోలో ఎక్కి కూర్చున్న  క్రిస్టీనా.. తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆటోవాలా తీరును వివరిస్తూ వీడియో తీసింది. ఆటోవాలా రోజంతా ఖాళీగానైనా ఉంటాను కానీ... మీటరు మాత్రం వేయడు అని కామెంటరీ చెబుతూ వీడియోను రికార్డ్ చేసింది. ఇక బోర్ కట్టకుండా వుండడానికి మధ్యలో బాలీవుడ్ పాటలు పాడింది. అటోవాలకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

ఏమిట్రా ఈ అమ్మాయి ఆటోలో కూర్చుని పాటలు పాడుతుంది. తన కెమెరాతో మొత్తం తతంగాన్ని షూట్ చేస్తుందని అనుకున్నాడో ఏమో.. రెండో పాటను లకించుకోగానే ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. చార్మినార్.. చాల ప్రసిద్దమైన ప్రాంతానికి వెళ్లాలని చెప్పానుగా అని అమెరికా అమ్మాయి అనింది. అది కూడా మీటర్ వేస్తేనే అనే సరిగి జీహుజూర్ అంటూ అటో వాలా మీటరు వేసి మరీ అమెను చార్మినార్ కు తీసుకెళ్లాడు. ఆ తరువాత తాను ఆటోవాలాతో జరిపిన తంతంగాన్నంతా.. సామాజిక మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. విషయం అందరికి తెలిసిపోయింది.

అయితే భారతీయ ఆటోవాలాలు తాము అడిగినంత ఇవ్వాలని మొండికేయడం, ఈ తతంగాన్ని వీడియో తీసి భారత దేశ పరువును ప్రపంచ వీధుల్లో పెట్టీ తీసేయాలనుకోవడాన్ని పలువరు స్వదేశీ అభిమానులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో సెల్ ఫోన్ ల కోసం, చిల్లర డబ్బుల కోసం, పార్కింగ్ స్థలాల కోసం విఛక్షణా రహితంగా తన్నుకోవడం, కాల్పులు జరపడం వంటి సంస్కృతి భారత దేశంలో కనబడదని స్వదేశీ అభిమానులు పేర్కోంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Autowala  revenge  American scholar  Christine Fair  

Other Articles