Smithasabarwal | Telangana | cartoon | outlook

Weekly news magazine outlook has landed itself in fresh trouble after smita sabharwal

Smithasabarwal, Telangana, cartoon, outlook

Weekly news magazine Outlook has landed itself in fresh trouble after Smita Sabharwal, an IAS officer in the Telangana Chief Minister's office has sent a legal notice to the magazine for carrying a sexist piece on her.

స్మితాసబర్వాల్ పై గలీజు కార్టూన్.. లీగల్ నోటీసులు

Posted: 06/30/2015 04:41 PM IST
Weekly news magazine outlook has landed itself in fresh trouble after smita sabharwal

ఔట్ లుక్ మ్యాగజీన్ తాజాగా వేసిన కార్టూన్ వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఉన్నట్లు గీసిన కార్టూన్ దుమారాన్ని రేపుతోంది. అయితే సర్వత్రా దీనిపై విమర్శలు రావడంతో ఆ మ్యాగజీన్ కార్టూన్ ను తొలగించింది. అయితే తనపై అసభ్య కథనాలు రాసిన ఔట్‌లుక్ మ్యాగజీన్‌పై తెలంగాణ సీఎంవోలోని అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు తన న్యాయవాది ద్వారా ఔట్‌లుక్ పత్రికకు లీగల్ నోటీసు పంపించారు. తన క్లయింట్‌ స్మితా సబర్వాల్ ను కించపరిచేలా కథనాలు రాశారని దానిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది ఐదు పేజీల నోటీసు పంపించారు. దీనిపై ఔట్‌లుక్ నుంచి సమాధానం రాగానే పరువు నష్టం దావా వేసే యోచనలో స్మితా సబర్వాల్ ఉన్నారు. కాగా, స్మిత సబర్వాల్ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమకారులను మొబలైజ్ చేశారని యోచించి జూనియర్ అయినప్పటికీ ఆమెకు సీఎంవోలో కీలక అదనపు కార్యదర్శి పదవిని సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే.

smitha-sabarwal-cartoon

smitha-sabarwal-legal-notic

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smithasabarwal  Telangana  cartoon  outlook  

Other Articles