NASA explains why June 30 will be precisely one second longer

June 30 will have an extra second nasa

National Aeronautics and Space Administration,June,June 30,NASA, Earth, Coordinated Universal Time (UTC), NASA, Extra second, leap, second, Atomic time, Coordinated Universal Time, Earth's rotation, Daniel MacMillan, Goddard Space Flight Center

Strictly speaking, a day lasts 86,400 seconds. On June 30, the day will officially be a bit longer than usual because an extra second or "leap" second will be added and NASA has an explanation for this.

జూన్ 30న వచ్చి చేరుతున్న అదనపు సెకను..!

Posted: 06/28/2015 02:51 PM IST
June 30 will have an extra second nasa

ఒక రోజుకు ఎన్ని సెకన్లని ఏ హైస్కూలు విద్యార్థినైనా అడిగితే 86,400 సెకన్లని సమాధానం చెప్తాడు. నిజానికి అది సరైన సమాధానమే. అయితే ఈ జూన్ 30 మాత్రం మామూలు రోజుకన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదనంగా ఒక లీపు సెకనును ఈ రోజుకు జోడించనున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) కారణాలు కూడా తెలియజేసింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని మన అందరికీ తెలుసు. అయితే భూమి పరిభ్రమణ వేగం రానురాను కాస్త తగ్గుతూ ఉంది. అందువల్ల ఆ లోటును భర్తీ చేయడానికి లీపు సెకనును జోడించడం ఒక మార్గమని మేరీలాండ్ గ్రీన్‌బెల్ట్ ప్రాంతంలో ఉన్న నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌కు చెందిన డేనియల్ మాక్మిలన్ చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జనం తమ దైనందిన జీవితాల్లో ఉపయోగించే యుటిసిగా పికోర్డినేటెడ్ యూనివర్సల్ టైమింగ్ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. యుటిసి అనేది ఆటోమేటిక్ టైమ్. అది ఎంత కచ్చితమైన సమయం అంటే 14,00,000 సంవత్సరాలకు ఒక్క సెకను మాత్రమే తేడా వచ్చే అవకాశం ఉంది. అయితే మామూలు సౌర రోజు అంటే భూమి తన చుట్టూ తాను ఒక సారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుందనే ఆధారంగా నిర్ణయించిన రోజుకు దాదాపు86,400.002 సెకన్లుగా లెక్క వేసారు. భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య ఆకర్షణ శక్తికి సంబంధించి జరిగే యుద్ధం అనే బ్రేకింగ్ శక్తి కారణంగా భూమి పరిభ్రమణ వేగం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాపుగా 1820 సంవత్సరం అంతకు ముందునుంచే ఈ మామూలు సౌర రోజుకు 86,400 సెకన్లుగా ఉండడం లేదని శాస్తజ్ఞ్రులు అంచనా వేసారు. అంటే ఈ రెండు మిల్లీ సెకన్ల తేడా (ఇది నిజానికి రెప్పపాటుకన్నా తక్కువ సమయం)ను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ చిన్న పాటి తేడా ప్రతి రోజూ ఏడాది పొడవునా సంభవిస్తే అదంతా కలిపితే దాదాపు ఒక సెకను అవుతుంది. అందుకే ఒక లీపు సెకనును జూన్ 30, లేదా డిసెంబర్ 31న జోడిస్తూ ఉంటారు. మామూలుగా గడియారం 23 గంటల 59 నిమిషాల 59 సెకన్ల తర్వాత జీరో అవర్ వచ్చి మరుసటి రోజు మొదలవుతుంది.

అయితే లీపు సెకనును చేర్చినప్పుడు మాత్రం గడియారం 23:59:59: చూపించిన తర్వాత 23:59:60కి మారి ఆ తర్వాత జూలై 1వ తేదీలోకి 00:00:00కు మారుతుంది. అలా చేయడానికి బదులు మామూలుగా చాలా సిస్టమ్‌లను ఒక సెకను పాటు ఆపేస్తారు. ఇంతకు ముందు లీపు సెకన్లను కలిపినప్పుడు కొన్ని రకాల కంప్యూటర్ వ్యవస్థల్లో అనేక సమస్యలు తలెత్తాయి. అయితే ఇప్పుడలాంటి సమస్యలేమీ తలెత్తక పోవచ్చని శాస్తజ్ఞ్రులు భావిస్తున్నారు. మొట్టమొదటిసారి లీపు సెకనును చేర్చిన 1972నుంచి 1999 దాకా ప్రతి సంవత్సరం దాదాపు ఒక లీపు సెకనును చేరుస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత దీని ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటోంది. నిజానికి జూన్ 30న జోడించే లీపు సెకను 2000నుంచి ఇప్పటివరకు అదనంగా చేర్చిన నాలుగో లీపు సెకను మాత్రమే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NASA  leap  second  Atomic time  Coordinated Universal Time  Earth's rotation  

Other Articles