first class girl raped and murdered

7 years girl raped and murdered

first class girl raped and murdered, crime on girls, harrasment on girls, molestation on girls, violence on girls, crime on ap, crime in west godavari, crime in madepally, 7 years old girl, kidnap, rape, murder, eluru, west godavari

a localite had kidnapped a 7 year old girl, raped her and murdered.

ఏడేళ్ల చిన్నారిపై మదమృగం దాడి. అత్యాచారం.. హత్య

Posted: 06/18/2015 10:15 PM IST
7 years girl raped and murdered

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఏలూరు మండలం మాదేపల్లిలో ఓ చిన్నారిపై స్థానికంగా వుండే ఓ మధమృగం కామంతో విరుచుకుపడింది. అంతటితో ఆగకుండా తన బండారం బయటపడకూడదని చిన్నారిని దారుణ హత్య పాల్పడింది. వివరాల్లోకి వెళ్లే మాదేపల్లిలో. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన లావణ్య(7) ఇవాళ ఉదయం బీరువాలో శవమై కనిపించింది. ఈ దారుణానికి ఒడిగట్టింది అదే కాలనీకి చెందిన సురేష్ అనే వ్యక్తిగా అనుమానం వచ్చిన గ్రామస్థులు అతనికి దేహశుద్ది చేశారు.

అయినా నిజం చెప్పకపోవడంతో  పోలీసులకు అప్పచెప్పారు. తమదైన శైలిలో విచారించిన పోలీసులు అతనితో నిజం కక్కించారు. రెండు రోజుల కిందట లావణ్యను కిడ్నాప్ చేశానని,  ఆ తర్వాత అత్యాచారం చేసి.. ఎవరికీ తెలియకుండా చంపి మృతదేహాన్ని బీరువాలో దాచానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా వుండగా పోలీసుల అదుపులో వున్న నిందితుడు వారి కళ్లు గప్పి పారిపోయాడు. ఇవాళ సాయంత్రం మాదేపల్లి గ్రామాస్థులు సురేష్ ను పోలీసులకు అప్పగించగా, అతను పలాయనం చిత్తగించాడు, అయితే పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు పారిపోయాడని గ్రామస్థులు అరోపిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7 years old girl  kidnap  rape  murder  eluru  west godavari  

Other Articles